రాష్ట్రీయం

జిఇఎస్ సదస్సుకు హేమాహేమీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సుకు హేమా హేమీలు హాజరుకానున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ సదస్సును ప్రారంభించనున్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె , శే్వతసౌధం సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్ హాజరుకానున్నారు. వారితో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ సతీమణి చెర్రి బ్లెయిర్ , ఐసిఐసిఐ బ్యాంకు ఎండి చందాకొచ్చార్, డిఆర్‌డిఓ డైరెక్టర్ టెస్సీ థామస్, క్రిసిల్ ఎండి అశు సుయాష్, ఐబిఎం ప్రతినిధి రమా అక్కిరాజు, ప్రథమ్ సిఇఓ రుక్మిణి బెనర్జీ, షాప్ క్లూస్ అధినేత రాధికా అగర్వాల్ హాజరవుతున్నారు. వీరితో పాటు వివిధ సంస్థల అధిపతులు పాల్గొంటున్నారు. మ్యాప్ మై జీనోమ్ సిఇఓ అను ఆచార్య, ఓల సిఇఓ భవిష్ అగర్వాల్, ఆరంజ్ ఫైబర్ సిఇఓ ఎన్‌రికా ఎరీనా, నాదన్ అసోసియేట్స్ సిఇఓ సుసాన్ బి చొటకీవిడ్జి, షాటర్ ఫండ్ అధినేత్రి షాలిని కొలిన్స్, క్రియేటివ్ ఆఫీసర్స్ అధినేత్రి అనితా డోంగ్రి, లెటిసియా గుస్కా(ఫెయిల్యూర్ ఇనిస్టిట్యూట్), అన్నా వెనెస్ హకటాసింటో(న్యూసావి), వాణి కోలా (కలారి క్యాపిటల్), స్టీఫెన్ లీనస్ (నెక్ట్స్ పేజీ), రాయో మహబూబ్, స్టీఫెన్ మారస్, శాంతి మోహన్, లారెటో మెటాసోమై, సిబోంగైల్ సాంబో, కార్ల తనాస్, అంజిలి బన్సాల్, దీపన్‌విత చటోపాథ్యాయ, రోహిణీ డే తదితరులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వారంతా తమ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు. వినూత్న రంగాలు, అత్యధిక అభివృద్ధి సాధించే అవకాశం ఉన్న పరిశ్రమలు, జీవశాస్త్రాలు, డిజిటల్ రంగం, ఆర్ధిక రంగం, వ్యవసాయం, ఆరోగ్యం, కంప్యూటర్, విద్య, మీడియా, వినోదం తదితర రంగాల్లో ప్రగతిని, మహిళల భాగస్వామ్యాన్ని కూడా చర్చిస్తారు. అదే విధంగా స్టార్టప్‌లు, ఇతర ఫౌండేషన్లను నిర్వహిస్తున్న మహిళలు తమ అనుభవాలను పంచుకుంటారు. సదస్సులో ప్రదర్శించే స్టార్టప్‌లను వీక్షించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు.
కార్యక్రమాలు
నవంబర్ 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల తీరులో మార్పుపై కూడా ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఐదు సంస్థల ప్రతినిధులు ఇందులో మాట్లాడుతారు.
నవంబర్ 29న 9 గంటలకు మనం చేయగలం పేరిట ప్లీనరీ ఉంటుంది. 10.15కి జిఐఎస్‌టి ప్లీనరీ జరుగుతాయి. మాస్టర్ క్లాస్, బ్రేకవుట్ పేరిట వేర్వేరు హాల్స్‌లో సదస్సులు నిరంతరం జరుగుతాయి. 29వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సదస్సులు ముగించి అంతా గోల్కొండ ఫోర్టుకు వెళ్తారు. 30వ తేదీ ఉదయం 9 గంటలకు 15 అంశాలపై ప్లీనరీ మొదలవుతుంది. సాయంత్రం 3.45కి ముగింపు కార్యక్రమం జరుగుతుంది. అనంతరం అవార్డుల ఉత్సవం జరుగుతుంది.

చిత్రం..సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న హైటెక్స్ రోడ్డు