రాష్ట్రీయం

సింగపూర్‌కు దీటుగా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 17: సింగపూర్‌లోని ఉత్తమ విధానాలను మలిదశలో ఏపీలో అమలుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రాజధాని అమరావతి నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక అందించడమే కాకుండా అనేక అంశాల్లో సింగపూర్ భాగస్వామి కావడం నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేలిమలుపుగా ఆయన అభివర్ణించారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి ఈశ్వరన్ పర్యటన సందర్భంగా శుక్రవారం సచివాలయంలో జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జెఐఎస్‌సీ) రెండో సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ‘అభివృద్ధిలో మీరు దూసుకుపోతున్నారు, మిమ్మల్ని అందుకోవాలని మేం ప్రయత్నిస్తున్నాం. రాజధాని నిర్మాణంలో సహకరిస్తున్న మీకు ఎప్పటికీ మిత్రులుగా ఉంటాం’ అని చంద్రబాబు అన్నారు. రాజధాని పేరుతో ఒక కాంక్రీట్ జంగిల్ నిర్మించాలని అనుకోవడం లేదని, ఇక్కడి సహజ వనరులను ఉపయోగించుకుంటూ, ఆధునిక సాంకేతికతతో అత్యద్భుతమైన రాజధాన్ని నిర్మించాలన్నదే తమ ప్రయత్నమని ఈశ్వరన్‌తో ముఖ్యమంత్రి అన్నారు. అమరావతిలో విద్యుత్ వాహనాలకే ప్రాధాన్యం ఇస్తామని, తొలిదశలో 1500 ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థ నిర్మాణంలో ‘సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్’ సూచనలు, సలహాలు తీసుకుంటామని అన్నారు. అమరావతి ఇంటిగ్రేటెడ్ వాటర్ అథారిటీ, వాటర్ మాస్టర్ ప్లాన్ పురోగతి గురించి సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖూ టెంగె చె సమావేశంలో వివరించారు. తొలి జెఐఎస్‌సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిపై ఈ భేటీలో చర్చించారు. అమరావతి ప్లానింగ్, డిజైన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు, క్యాపిటల్ రీజియన్ ఇనె్వస్టిమెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (సీఆర్‌ఐపీఏ) వంటి అంశాలపై సమావేశం దృష్టి పెట్టింది. ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుపై కార్యగోష్టులు నిర్వహిస్తున్నామని ఖూ టెంగ్ చె తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ అంశంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు ‘ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజ్ సింగపూర్’ అసిస్టెంట్ సిఈవో టాన్ సూన్ కిమ్ చెప్పారు. సమావేశంలో ముందుగా ఏపీ సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాల గురించి వివరించారు. అమరావతి పార్టనర్‌షిప్ ఆఫీస్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ ఛాంగ్ ప్రారంభోపన్యాసం చేశారు. అమరావతి ప్రాజెక్టు పురోగతిపై ప్రాజెక్టు ఏపీఈవో బెంజమిన్ యాప్ మాట్లాడారు. సింగపూర్-విజయవాడ మధ్య వారంలో కనీసం మూడు విమాన సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సింగపూర్ మంత్రిని కోరారు. అమరావతిలో ఉష్ణోగ్రతలను తగ్గించే డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సింగపూర్ డిస్ట్రిక్ట్ కూలింగ్ మేనేజింగ్ డైరెక్టర్ జమీ ఖూను ముఖ్యమంత్రి సూచించారు. ఈ తరహా వ్యవస్థ ప్రపంచంలో తొలిసారి సింగపూర్‌లో ఏర్పాటు చేశామని, 40 శాతం ఇంధనాన్ని ఆదా చేయొచ్చని జమీ తెలుపగా, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే అమరావతిలో ఈ తరహా అత్యవసరమని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీలోని ఏదైనా ఒక నగరంలో ప్రయోగాత్మకంగా సౌర విద్యుత్ వినియోగించుకునేలా బస్‌స్టాపులలో శీతలీకరణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సింగపూర్ ప్రభుత్వ నిధులను ముఖ్యమంత్రి కోరారు. 2018 జూలైలో నిర్వహించే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రిని సింగపూర్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఏపీని హార్టీకల్చర్ హబ్‌గా తయారు చేస్తున్నామని, ఆక్వా కల్చర్ రంగంలో అగ్రగామిగా ఉన్నామని, మరిన్ని పరిశ్రమలు వస్తే అభివృద్ధి సత్వరం సాధ్యమవుతుందన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఖూ టెంగ్ చె సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మానవ వనరుల అభివృద్ధి అంశంలో లీ క్వాన్ యూనివర్సిటీ తమతో కలిసి పనిచేయాలని సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ సెకండ్ పర్మనెంట్ సెక్రటరీ పింగ్ చియోంగ్ బూన్‌కు ముఖ్యమంత్రి సూచించారు. ‘స్టేట్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో సింగపూర్ వర్సిటీ తీసుకొస్తున్న అమరావతి నిర్మాణాన్ని ఒక ఛాప్టర్‌గా చేర్చాలని తాను సూచించిన విషయాన్ని గోపీనాథ్ పిళ్లయ్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, నారా లోకేష్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, అమరావతి అభివృద్ధి సంస్థ సిఎండీ లక్ష్మీపార్థసారధి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణకిషోర్, సింగపూర్ నేషనల్ డెవలప్‌మెంట్ సెకండ్ మినిస్టర్ డెస్మోండ్ లీ పాల్గొన్నారు.

చిత్రం..సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో సమావేశమైన చంద్రబాబు