రాష్ట్రీయం

పదవుల కోసం ఎవరి కాళ్లూ మొక్కలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 18: అంచెలంచలుగా దేశంలోనే అత్యున్నతమైన రెండవ పదవిని చేపట్టే స్థాయి వరకు స్వశక్తితో ఎదిగానని, పదవుల కోసం తాను ఎన్నడూ ఎవరి కాళ్లూ మొక్కలేదని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన నందమూరి తారక రామారావు కాళ్లు మొక్కిన వారే అనంతరం ఆయనను లాగి పడేసారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ సమీపంలోని గీతం విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవ కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను క్రమ శిక్షణతో కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఉన్నతమైన ఉపరాష్టప్రతి పదవి చేపట్టిన ఎన్నడూ పదవుల కోసం ఎవరికీ కాళ్లు మొక్కే స్థాయికి దిగజారలేదన్నారు. ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఆయనను కలిసేందుకు వెళితే చుట్టూ గుమిగూడిన వారిని పక్కకు తప్పించి తనతో మాట్లాడారని, ఈ సందర్భంగా అందరు వంగి వంగి కాళ్లు మొక్కుతున్నారని, అది మంచి సంప్రదాయం కాదని, పద్ధతి మార్చుకోవాలని ఎన్‌టిఆర్‌కు సూచించినట్లు గుర్తు చేసారు. ‘నేను ఎవరినీ మొక్కమనడం లేదని, వాళ్లే అభిమానంతో మొక్కుతున్నారని’ తన మాటలను ఎన్టీఆర్ తేలికగా కొట్టిపారేసారని, కానీ కొద్ది రోజులకే కాళ్లు మొక్కిన వారు లాగిపారేసారన్నారు. దేశంలోనే రెండవ పెద్ద పదవి అయిన ఉప రాష్టప్రతిగా బాధ్యతలు స్వీకరించడం వల్ల రాజకీయాలకు దూరమయ్యానని, అయినా తాను మాత్రం జీవితాంతం ప్రజాక్షేత్రంలోనే ఉండి వారికి సేవలు అందించడానికి కృషి చేస్తానని ఉద్ఘాటించారు.

చిత్రం..శనివారం సంగారెడ్డిజిల్లాలోని గీతం వర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు