రాష్ట్రీయం

మనం చేయగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సుకు రంగం సిద్ధం అవుతోంది. 150 దేశాల నుండి 1500 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకాబోతున్నారు. సదస్సులో పాల్గొనే ప్రతినిధుల్లో 800 మంది మహిళలే కావడం విశేషం. కనీసం 10 దేశాల నుండి వచ్చే వారంతా మహిళలే కావడం ఈ సదస్సు ప్రత్యేకత కాబోతోంది. ఆఫ్గనిస్తాన్, సౌదీ, ఇజ్రాయిల్ వంటి దేశాల ప్రతినిధులు అంతా మహిళలే. 30 ఏళ్లలోపు వారే దాదాపు 500 మంది ఉండబోతున్నారు. అతిపిన్నవయస్కురాలు వయస్సు 13 ఏళ్లు కాగా, అతి పెద్ద వయస్కురాలు 84 ఏళ్ల ప్రాయం వారు కూడా హాజరవుతున్నారు.
కీలక నేతలు , వక్తలు, వివిధ సంస్థల యజమానులను స్వాగతం పలికేందుకు హైటెక్స్ ముస్తాబవుతోంది. ఇందుకోసం హైటెక్స్‌లో రెండు ప్రత్యేక స్వాగత కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులను సదస్సులోకి అనుమతించేందుకు ఒక కౌంటర్, దేశ విదేశాల నుండి నుండి వచ్చిన వారికోసం ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటవుతున్నాయి. విదేశాల నుండి వచ్చిన వారికి బస, ఆహార సదుపాయాలు, నగర సందర్శన, వీసా తదితర ఇమిగ్రేషన్ సలహాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. అలాగే కీలకమైన ప్రారంభ ప్లీనరీ సదస్సుకు, ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు అధికారులకు, మీడియాకు, విద్యార్థులకు, పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక పాస్‌లను ఇవ్వనున్నారు. బ్రేకవుట్స్, మాస్టర్ క్లాస్, వర్కుషాప్ పేరుతో మూడు రకాల సమావేశాలు సమాంతరంగా జరగనున్నాయి. బ్రేకవుట్స్‌లో కీలక అంశాలపై ముఖ్యవక్తలు మాట్లాడతారు. వినూత్న పరిశ్రమలు, పారిశ్రామిక ఔత్సాహికతకు సంబంధించిన విషయాలపై ఇందులో చర్చిస్తారు. ఈ సమావేశాలకు సుమారు 300 నుండి 350 మందిని అనుమతిస్తారు. ఇక మాస్టర్ క్లాస్ సమావేశాల్లో మరింత సూక్ష్మాంశాలపై లోతుగా చర్చిస్తారు. దీనికి ఎంపిక చేసిన 150 మంది వరకూ పారిశ్రామికవేత్తలను అనుమతిస్తారు. ఇక వర్కుషాప్‌లు ఉంటాయి. ఇందులో కనీసం 40 నుండి 50 మందిని అనుమతిస్తారు. ఈవర్కుషాప్‌ల్లో ఇప్పటికే వివిధ రంగాల్లో విజయం సాధించిన వారు తమ ఆలోచనలు, అమలు చేసిన తీరు, ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు, భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణ, మిగిలిన వారికి తోడ్పాటు అందించడం వంటి అంశాలపై చర్చ జరుగుతుంది. అంకురాలను ప్రారంభించి ఇబ్బందులు పడిన వారికి మార్గదర్శకంగా కూడా కొన్ని సూచనలను ఇందులో అందిస్తారు.
ప్రతి రోజు సదస్సు ఉదయం 7 గంటలకు అల్పాహారంతో మొదలవుతుంది. 9 గంటలకు ప్లీనరీ సెషన్ మొదలవుతుంది. 29వ తేదీన తొలి ప్లీనరీలో మనం చేయగలం అనే భరోసా ఇచ్చేందుకు శక్తివంతమైన మానవ వనరులను తయారుచేసుకోవడం, శిక్షణ, నైపుణ్యాలను అందించడంపై ఈ ప్లీనరీ జరుగుతుంది. కెరీర్ కౌనె్సలింగ్ , మహిళల జీవన స్థాయి పెంపు, ఆయా దేశాల్లో సమాజ స్థితిగతులు, దేశాల పరిస్థితులు కూడా ఇందులో చర్చకు వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా నెట్‌వర్కింగ్, గ్లోబల్ ఇన్నోవేషన్ అనే అంశంపై మరో ప్లీనరీ జరుగుతుంది.
29వ తేదీ మధ్యాహ్నం 11.15కి మాస్టర్ క్లాస్, వర్కుషాప్‌లు మొదలవుతాయి. ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులను ఆకర్షించడం, హాలీవుడ్ , నాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌ల మధ్య అనుసంథానం చేసి సినిమాలు నిర్మించడం, కోచ్‌లు, మెంటార్ల అవసరాలను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహాన్ని, అవకాశాలను కల్పించడం, తేలికగా పరిశ్రమల ఏర్పాటుకు మార్గదర్శకం వహించడం, డిజిటల్ విప్లవంలో అవకాశాలు అందిపుచ్చుకున్నవారికి, లేనివారికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చడం, ఆరోగ్య రంగంలో అంకురాలను ప్రోత్సహించడంపై కూడా చర్చ జరుగుతుంది.