రాష్ట్రీయం

సందేశాత్మక చిత్రాల ద్వారా సమాజంలో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: ‘చదువుకోవాలి’ వంటి సందేశాత్మక చిత్రాల ద్వారా సమాజంలో గుణాత్మక మార్పులు వస్తాయని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక వాఖ అధ్వర్యంలో శనివారం రవీంద్ర భారతిలో సినీ వారం కార్యక్రమంలో భాగంగా ‘చదువుకోవాలి’ సినిమా ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిజిపి మహేందర్ రెడ్డి ప్రసంగిస్తూ సీనియర్ పాత్రికేయుడు, అపార అనుభవం ఉన్న మద్దాలి వెంకటేశ్వర రావు (ఎంవి రావు) సామాజిక బాధ్యతగా భావించి ‘చదువుకోవాలి’ సినిమా తీశారని అభినందించారు. సీనియర్ ఐఎఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా ప్రసంగిస్తూ చదువుకోవాలి వంటి సందేశాత్మక చిత్రాల ద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందన్నారు. పిల్లలు తప్పని సరిగా పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలన్న తపన దర్శకుడిలో కనిపించిందని ఆయన తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ జగదీశ్వర్ ప్రసంగిస్తూ చిత్రంలోని పాటలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రసంగిస్తూ రచయితంగా, దర్శకునిగా, కవిగా ఎంవి రావు ప్రతిభ కనబరిచారన్నారు. ఇంకా ఈ సన్మాన కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్-చైర్మన్ లింబాద్రి, వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, డాక్టర్ సి. హరినాథ శర్మ, సాంస్కృతిక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, దర్శకుడు వెంకటేశ్వర రావును సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.