రాష్ట్రీయం

అడ్డంగా దొరికిన అవినీతి సర్వేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 18: రికార్డులు తారుమారు చేసిన నేరంలో ఇప్పటికే పోలీసు కేసు ఎదుర్కొంటున్న సర్వేయర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేంద్ర దర్యాప్తు ఆదేశంతో దాడులు నిర్వహించింది. సర్వే శాఖలో సర్వేయర్‌గా పనిచేస్తున్న గేదెల లక్ష్మీ గణేశ్వర రావు కొద్ది రోజుల కిందట సిట్ బృందం దర్యాప్తులో అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. తాజాగా గణేశ్వర రావు, అతని కుటుంబీకులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ శనివారం ఉదయం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సుమారు రూ.7 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ డీఎస్పీ రమాదేవి వెల్లడించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ సుమారు రూ.100కోట్లకు పైగానే ఉంటుందని పేర్కొన్నారు. విశాఖ నగరంలో గల గణేశ్వర రావు ఇంట్లో సోదాలు నిర్వహించగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, బంగారు, వెండి ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు, కార్లు, మోటారు సైకిళ్లు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్టు కనుగొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 30.36 ఎకరాల భూములు, ఖాళీ నివేశన స్థలాలు, అపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు చేసే నిమిత్తం ఇంటికి వచ్చిన ఏసీబీ అధికారులపైకి గణేశ్వరరావు కుమారుడు పెంపుడు కుక్కలను ఉసిగొలిపి భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో ఏసీబీ సిబ్బంది స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాల్సి వచ్చింది. ఏసీబీ అధికారులు గుర్తించిన స్థిరాస్తుల్లో ఐదు ప్లాట్లు, మరో 19 ఇళ్ల స్థలాలు ఉన్నాయి. వీటితో పాటు సోదాల్లో రూ.36వేల నగదు, మరో రూ.25వేల పాత కరెన్సీ (రద్దయిన రూ.500,రూ.1000 నోట్లు), రూ.10లక్షలు కలిగిన బ్యాంకు ఖాతాలు, ఇంట్లో రూ.10 లక్షల విలువైన సామాగ్రితో పాటు ఒక కిలో బంగారు, మూడు కిలోల వెండి ఆభరణాలను గుర్తించారు. వీటితో పాటు అత్యంత ఖరీదైన ఇన్నోవా, వోల్వో, హోండా ఐ 20కార్లు, రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు.

చిత్రం..ఏసీబీ సోదాల్లో బయటపడిన బంగారు, వెండి ఆభరణాలు