రాష్ట్రీయం

ఎస్టీల విద్యుత్ బకాయిలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: గిరిజనుల విద్యుత్ బకాయిలన్నీ రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గిరిజనులపై ఉన్న విద్యుత్ కేసులను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. గిరిజనుల ఇళ్లకు, వ్యవసాయదారుడికి విద్యుత్ కనెక్షన్ కల్పించనున్నట్టు చెప్పారు. ప్రతి ఎస్టీ ఆవాస ప్రాంతానికీ రోడ్లు వేసేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు. ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించి, రూ.70 కోట్లకు పైగా ఉన్న బకాయిలను రద్దు చేయాలని ఆదేశించారు. వీటికి సంబంధించి రూ.40 కోట్లను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాలని, మిగతా రూ.30 కోట్లను తాము మాఫీ చేస్తామని జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావుకు చెప్పారు. కాగా ఎస్టీలపై పెట్టిన విజిలెన్స్ కేసులు కూడా రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఎస్టీ ఇంటికి రూ.125 మాత్రమే ఫీజు తీసుకుని విద్యుత్ సదుపాయం కల్పించాలన్నారు. 50 యూనిట్లు లోపు వినియోగించే వారినుంచి ఎలాంటి చార్జీ తీసుకోబోమన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్టీల స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాలకూ కచ్చితంగా రోడ్డు సదుపాయం కల్పించే విషయమై సీనియర్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ నాయకత్వంలో కమిటీని నియమించారు. విద్య, స్వయం ఉపాధి విషయంలో సమన్వయానికి ఏంపీ సీతారాంనాయక్ నాయకత్వంలో కమిటీని నియమించారు. విద్యుత్‌కు సంబంధించిన అంశాలను సమన్వయం చేయడానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.