రాష్ట్రీయం

సీఎం వౌనం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 19: దేశంలో కొనసాగుతున్న మతోన్మాద దాడులపై ఏపీ సీఎం చంద్రబాబు వౌనం వహించడం సరైందికాదని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు. అనంతపురంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో గో సంరక్షణ పేరిట దాడులు కొనసాగుతున్నాయన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. పద్మావతి సినిమా విడుదల కాకమునుపే, కథాంశం ఏమిటో పూర్తిగా తెలియకముందే దాడులు చేస్తున్నారని, ఇది వాక్‌స్వాతంత్య్రాన్ని హరించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజల దృష్టిని సమస్యల నుంచి పక్కదోవ పట్టించేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పనుల నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేస్తున్నా సీఎం చంద్రబాబు ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారని, ఈ నిధులపై త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ఢిల్లీలో ఆందోళన చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.

చిత్రం..అనంతపురంలో మీడియాతో మాట్లాడుతున్న బృందాకారత్