రాష్ట్రీయం

ప్రగతి రథం పరిగెడుతోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలోని సంబయోసిస్ వర్శిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ బ్లాక్స్‌ను గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ‘దేశాభివృద్ధిలో విద్యాలయాల పాత్ర’ అంశంపై గవర్నర్ మాట్లాడుతూ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన దేశం ఒకటని, అదేవిధంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని తెలిపారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన వర్శిటీల్లో ఒకటైన సింబయోసిస్ తెలంగాణ రాష్ట్ర విద్యా ముఖ చిత్రాన్ని మార్చేసిందన్నారు. ప్రస్తుతం సుమారు 80 దేశాల విద్యార్థులు చదవడం సింబయోసిస్ గొప్పతనమని ప్రశంసించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఈ తరుణంలో దేశంలోని యువత అంతర్జాతీయ స్థాయి ప్రావీణ్యాన్ని కనబరచాలని, ఉద్యోగాల కోసం ఆరాటపడకుండా ఉద్యోగాలు ఇచ్చే శక్తులుగా ఎదగాలని సూచించారు. భారతీయులు ఒక్క సిలికాన్ వ్యాలీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో మన దేశ గౌరవాన్ని ఇనుమడింపజేయాలని కోరారు. మన దేశం యువశక్తితో పరిఢవిల్లుతోందన్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆసుపత్రులు, హాస్పిటాలిటీ రంగాల్లో అవకాశాలు పెరగనున్నాయని తెలిపారు. ప్రస్తుతం మహిళలకు ఉద్యోగ, వ్యాపార ఉపాధి అవకాశాలు ఎక్కువ అవుతున్నాయని, ఇటీవల అమెరికన్ రిక్ ట్యాంక్ చేసిన సర్వేలో ప్రపంచంలోని 91 దేశాల్లోని కంపెనీల్లో 30 శాతం మహిళా ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు స్పష్టమైందని గవర్నర్ విద్యాసాగర్ రావు చెప్పారు. ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ సింబయోసిస్ వర్శిటీ 300మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. కొత్తూరు దగ్గరనుంచి సంబయోసిస్ వర్శిటీ ఉన్న మామిడిపల్లి గ్రామం వరకు విశాలమైన రోడ్డును ఇటీవలే మంజూరు చేసినట్లు చెప్పారు. మరో ఏడాది
కాలంలో వర్శిటీ మరింత అభివృద్ధి చెంది స్థానికులకు మరింతగా సహకరించాలని కోరారు. గ్రామీణ ప్రజలలో వాణిజ్యం, పారిశ్రామికాభివృద్ధి పట్ల మరింత అవగాహన పెంచి వారు పారిశ్రామికవేత్తలయ్యేలా సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రసంగిస్తూ మామిడిపల్లితో పాటు షాద్‌నగర్ వాస్తవ్యులకు సింబయోసిస్ విశ్వవిద్యాలయం కొన్ని సీట్లు కేటాయించి స్థానిక విద్యార్థులకు అవకాశం కల్పించాలని కోరారు. సింబయోసిస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్‌బి ముజుందార్, సంజీవని ముజుందార్ తదితరులు ప్రసంగించారు.