రాష్ట్రీయం

కుల, మత రాజకీయాలతో కలుషితమవుతున్న వర్శిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 30: భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం కులం, మతం, రాజకీయ జోక్యాలు పెచ్చరిల్లుతున్నాయని, దీనివలన ఏ విద్యార్థీ కూడా స్వేచ్ఛగా విద్యనభ్యసించే పరిస్థితి కనిపించడం లేదంటూ ఎఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లాఖాద్రి, విశ్వజిత్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలే ప్రబల నిదర్శనమన్నారు. రోహిత్‌ది ఆత్మహత్య కాదని సర్కారీ హత్యగానే భావించాల్సి ఉందన్నారు. ఎఐఎస్‌ఎఫ్ 46వ రాష్ట్ర మహాసభల్లో రెండోరోజైన శనివారం ఐవి ప్యాలెస్‌లో జరిగిన ప్రతినిధుల సభలో వారు ప్రసంగించారు. విశ్వజిత్‌కుమార్ మాట్లాడుతూ రూసా పేరుతో భాషను, విద్యను వికేంద్రీకరించి హిందుస్థాన్ పేరుతో ప్రాంతీయ భాషను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఇది హిందుత్వ ఎజెండాలో భాగమంటూ దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లెనిన్, భగత్‌సింగ్, కారల్‌మార్క్స్, అంబేద్కర్, వివేకానందలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో, విద్యావ్యవస్థలో మార్పు కోసం ఈ మహాసభలు వేదికగా భవిష్యత్ పోరాటాలు సాగించాల్సి ఉందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలకు ఎఐఎస్‌ఎఫ్ శ్రీకారం చుట్టిందన్నారు. వలీఉల్లాఖాద్రి మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే వేలాది పాఠశాలలు మూతపడ్డాయన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఆశించిన యువతకు నిరాశే మిగిలిందన్నారు. సిలబస్‌లో మార్పులు చేసి జైళ్లలో గడిపిన దొంగ బాబాల చరిత్రను పాఠ్యాంశాలుగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దేశం కోసం పోరాడిన యువకిశోరం భగత్‌సింగ్ చరిత్ర పుస్తకాల్లో లేదన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ చాలదన్నట్లుగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ప్రవేశానికి రంగం సిద్ధం చేసారని ఇకపై విద్యా వ్యాపారం జోరుగా సాగే ప్రమాదం ఉందన్నారు. వీటిపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాల్ని నిర్ణయించాలన్నారు. ఈ సభలో ఆహ్వాన సంఘ అధ్యక్షులు డాక్టర్ పివి రమణమూర్తి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లెనిన్‌బాబు, ప్రధాన కార్యదర్శి ఐ.బయ్యన్న తదితరులు మాట్లాడారు.