రాష్ట్రీయం

సిద్దిపేట ఓడిఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 11 : బంగారు తెలంగాణను ఆవిష్కరించేందుకు తెలంగాణ సర్కారు అన్ని విధాల చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి ప్రకటించారు. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధ్యమన్నారు. ఆదివారం స్థానిక వడ్డెపల్లి ఫంక్షన్ హాల్‌లో సిద్దిపేట జిల్లాను బహిరంగ మలవిసర్జనరహిత నియోజకవర్గంగా డోలు వాయించి హోంమంత్రి నాయిని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం సిద్దిపేటలో మెగా జాబ్ మేళాను హోం మంత్రి నాయని, ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావులు ప్రారంభించారు. కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 1.12లక్షల ఉద్యోగాల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 25వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. సిద్దిపేట త్వరలో పారిశ్రామిక ప్రాంతంగా మారుతుందన్నారు. బెజ్జెంకిలో గ్రానైట్ పార్కు, దుద్దెడలో మొబైల్ ఫోన్ తయారీ యూనిట్, కలెక్టరేట్ వద్ద ఐటి టవర్ ఏర్పాటు చేయబోతున్నట్టు వివరించారు. ఐటి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ములుగు ప్రాంతంలో సీడ్ పార్కు ఏర్పాటుకు యత్నాలు జరుగుతున్నాయన్నారు. జాతీయ రహదారులు, రైల్వే, విద్యుత్ వంటి వసతులు ఉన్నచోట పరిశ్రమలకు పెట్టుబడులకు అవకాశం ఉందని, ఆదిశగా సిద్దిపేట అడుగులు వేస్తుందన్నారు. రెండేళ్లలో హైదరాబాద్, గజ్వేల్, సిద్దిపేట రైల్వేమార్గం ప్రారంభమవుతుందన్నారు. సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట- సూర్యాపేట, ఎల్కతుర్తి, సిద్దిపేట మార్గంలో రెండు హైవేల నిర్మాణం జరుగుతున్నాయన్నారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగ కోసం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కోసమే ఆశలు పెట్టుకోవద్దన్నారు. చిన్నదైనప్పటికీ ఏదైనా ఉద్యోగంలో చేరాలని,
అనుభవంతో, ప్రతిభను పెంచుకుని ఉన్నత స్థాయకి ఎదగాలని సూచించారు. ప్రైవేటు సంస్ధల్లో ప్రతిభకు మంచి గుర్తింపు ఉంటుందన్నారు. జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదన్నారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తూ ఉన్నత చదువులు అభ్యసించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంబంధిత పరీక్షలు రాయాలని సూచించారు. ఎందరో బడా పారిశ్రామిక వేత్తలు, దేశానికి రాష్టప్రతిగా సేవలందించిన మహానుభావులు అబ్దుల్ కలాం వంటివారు కిందిస్థాయి నుంచి ఎదిగారని మంత్రి గుర్తు చేశారు. ప్రధాని మోదీ సైతం చాయ్ అమ్మారన్నారు. ఉన్న ఊరు విడిచి పెట్టి బయటకు వెడితేనే ప్రపంచం తెలుస్తుందని, సమాజం అర్ధమవుతుందన్నారు. జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకొని అర్థికాభివృద్ధి చెందాలని చెందారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఉపాధి కోసం కృషిచేస్తున్న జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రైవేటు సెక్టార్‌లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతిభ ఉన్నవారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపి కొత్తప్రభాకర్‌రెడ్డి, కార్మిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరి శశాంక్ గోయల్, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జెసి పద్పాకర్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు

చిత్రం..డోలు కొట్టి సిద్దిపేటను ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి