రాష్ట్రీయం

నరుూం కేసు తేలేదెన్నడో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ అలియాస్ నరుూం ఎన్‌కౌంటర్‌లో హతమై ఏడాది గడచింది. అయినా సిట్ చేపట్టిన దర్యాప్తు పూర్తి కాలేదు. భూ ఆక్రమణలు, బెదిరింపులు, హత్యలు, కిడ్నాప్, అక్రమ భూ రిజిస్ట్రేషన్లు వంటి కేసుల్లో నరుూం, అతని అనుచరులపై మొత్తం 227 కేసులు నమోదయ్యాయి. నరుూం, అనుచరులు 27 హత్యల్లో నిందితులు, కాగా మరో 25 హత్యలకు కూడా వారే బాధ్యులుగా సిట్ అనుమానిస్తోంది. 14 మంది నరుూం అనుచరులపై పీడీ చట్టం ప్రయోగించి, 9 చార్జ్‌షీట్లు దాఖలు చేసినట్టు సమాచారం. నరుూంకు సహకరించిన పోలీసులు సస్పెండ్ అయ్యారు. అంటకాగిన అనుచరులు కొందరు జైలుకెళ్లారు. నరుూం నిర్మించిన నేర సామ్రాజానికి కీలక వ్యక్తులుగా మారిన ప్రజాప్రతినిధులు కొందరి పేర్లు పరోక్షంగా బయటకు వచ్చినా ఎలాంటి చర్యలు లేవు. కరుడుగట్టిన నేరగాడు నరుూం 2016 ఆగస్టులో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విష యం తెలిసిందే.
భువనగిరి కేంద్రంగా నరుూం, అతని అనుచరులు సాగించిన ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు 20ఏళ్ల నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ, నల్గొండతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన నరుూం ఆగడాలను పోలీసులు ఎట్టకేలకు కట్టడి చేయగలిగారు. నరుూం, అనుచరుల అరాచకాలు తమ దృష్టికి వచ్చినప్పటికీ వివిధ కారణాల వల్ల అప్పటి ప్రభుత్వాలు (కాంగ్రెస్, టీడీపీ) చూసీచూడనట్టు వ్యవహరించాయి.
కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం మట్టుపెట్టగలిగింది. నరుూం చనిపోయిన తరువాత కాని అతను పాల్పడ్డ అరాచకాలు వెలుగులోకి రాలేదు. నరుూం ముఠా నేరాలపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. డీజీ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ కేసుల విషయంలో దర్యాప్తు జరుగుతున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. నరుూం అనుచరులను అరెస్టు చేశారు. ముఖ్య అనుచరులపై పీడీ చట్టం ప్రయోగించారు. ఈ నేరగాడితో రకరకాల స్థాయిలో సంబంధాలు కొనసాగించిన పోలీసులపై వచ్చిన అభియోగాలను బట్టి చర్యలు తీసుకున్నారు.
ఈ కేసుల్లో ఐదుగురు పోలీస్ అధికారులు సస్పెండ్ కాగా, 21 మంది అధికారులకు చార్జిమెమోలు జారీ చేశారు. ఇదిలావుండగా ఈ కేసులో అనేక మంది ప్రజాప్రతినిధులకు నరుూంతో సంబంధాలు ఉన్నాయని, వారి మద్దతుతోనే నరుూం తన నేర సామ్రాజ్యాన్ని కొనసాగించగలిగాడని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చా యి. వీరిలో భువనగిరి టిఆర్‌ఎస్ నేత చింతల వెంకటేశ్వర రెడ్డి, శాసన మండలి సభాపతి నేతి విద్యాసాగర్‌లపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా అనేక మంది రాజకీయ నాయకులపైనా ఆరోపణలు వినిపించాయి. వీరిలో ఎల్బీనగర్ టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఉన్నారు. కాగా సిట్ అధికారులు ఆర్ కృష్ణ య్య వాంగ్మూలం కూడా నమోదు చేశారు. ఇంకా కొందరిని పిలిపించి విచారిస్తామని, వారిపై వచ్చిన అభియోగాలను బట్టి చర్యలు తీసుకుంటామని సిట్ పేర్కొంది. ఇందులో అధికార పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికార పార్టీకీ చెందిన ప్రజాప్రతినిధులెవరినీ పిలువలేదు..విచారించ లేదు..ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కానీ నరుూం అక్రమ ఆస్తులను మాత్రం సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాధితులకు ఇస్తామని ప్రకటించారు. అయితే కేసుల సంఖ్య చాలా పెరగడంతో న్యాయస్థానంలో విచారిస్తే..న్యాయపరమైన సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వీటిని విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన అప్పట్లో వచ్చింది.
కానీ అది ఇప్పటి వరకు అతీగతిలేదు. నరుూంకు చెందిన వందలాది ఎకరాల భూములు, నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు బాధితులకు అందజేయడంలో సాంకేతిక పరమైన అంశాలు చోటుచేసుకోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని సమాచారం. నరుూం కేసు కొలిక్కి వచ్చిందని, నవంబర్‌లోగా దర్యాప్తు పూర్తవుతుందని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు చార్జిషీట్ల దాఖలునే పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కేసు దర్యాప్తు పూర్తి ఎప్పుడవుతుందో..తమ ఆస్తుల అప్పగింత ఎప్పుడు జరుగుందోనని బాధితులు ఎదరుచూస్తున్నారు.