రాష్ట్రీయం

మోహినీ అవతారంలో అభయమిచ్చిన అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 19: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం మోహినీ అవతారంలో అమ్మవారు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క్భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
రాత్రి 8.30 గంటలకు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజ వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.
వైభవంగా వసంతోత్సవం
బ్రహ్మోత్సవాలలో శ్రీ పద్మావతీ అమ్మవారు అలంకరణలు, వాహనసేవలతో అలసి ఉంటారని, అమ్మవారు సేదతీరేందుకు ఈ వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ వసంతోత్సవంలో వివిధ సుగంధభరిత పుష్పాలు, వివిధ రకాల ఫలాలను అమ్మవారికి నివేదిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు అమ్మవారి ఆలయంలో ముఖ మండపంలో వసంతోత్సవం వేడుకగా జరిగింది. అనంతరం అర్చకులు, భక్తులు ఆహ్లాదకరంగా వసంతాలు (గంధం కలిపిన నీళ్లు) చల్లుకుంటూ, అమ్మవారి ఉత్సవర్లను ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది.

చిత్రం.. మోహినీ అవతారంలో పల్లకీలో ఊరేగుతున్న శ్రీ పద్మావతీ అమ్మవారు