రాష్ట్రీయం

నోట్ల మార్పిడి ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, నవంబర్ 20: పాత నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసి ఏడాది దాటుతున్నా ఇంకా ఆ నోట్ల మార్పిడి చేసే దందా గుట్టుగా సాగుతూనే ఉంది. ఎక్కడిక్కడ కట్టుదిట్టం చేస్తున్నా... ఒక్కటి కాదు... రెండు కాదు... లక్షల రూపాయల నోట్ల మార్పిడి చేసే ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. నిన్న కొమురం భీం జిల్లా తిర్యాణిలో పాత నోట్ల మార్పిడి ముఠా పట్టుబడగా... నేడు పెద్దపల్లి జిల్లా రామగుండంలో రద్దయిన పాత నోట్లను తరలిస్తూ మార్పిడి చేసే ఐదుగురు సభ్యుల ముఠా ఆదివారం రాత్రి పోలీసులకు చిక్కింది. ముఠా నుంచి 19 లక్షల రూపాయల పాత నోట్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు సోమవారం రామగుండం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీఐ వాసుదేవరావు అరెస్ట్ వివరాలను వెల్లడించారు. అరెస్టయిన వారిలో మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లా సిరోంచకు చెందిన జమీల్ హుస్సేన్, షఫీఖ్ అంకూస్ షేక్, తులసగిరి మధూకర్ సమ్మయ్య, మంచిర్యాల జిల్లాకు చెందిన నేరెళ్ల మనోహర్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బాలసాని రమేష్ ఉన్నారని తెలిపారు. రామగుండంలోని అక్బర్ నగర్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ముఠా పట్టుబడ్డట్లు చెప్పారు. వీరిని విచారించగా మహారాష్ట్ర ప్రాంతం నుంచి సిరోంచకు చెందిన ముఠా రద్దయిన 19 లక్షల రూపాయల పాత నోట్లను తీసుకువస్తే గోదావరిఖనికి ప్రాంతానికి చెందిన రమేష్, మంచిర్యాలకు చెందిన మనోహర్ నోట్లను మార్పిడి చేయిస్తానని చెప్పడంతో పాత నోట్లతో మహారాష్ట్రీయులు ఇక్కడికి వచ్చినట్లు వివరించారు. వీరి నుంచి రద్దయిన 19 లక్షల రూపాయల పాత నోట్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. అరెస్టయిన ముఠా సభ్యులను కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో రామగుండం ఎస్‌ఐలు రాజ్ కుమార్ గౌడ్, సాబీర్‌తోపాటు హెచ్‌సి వ్యవస్థ శ్రీనివాస్, కానిస్టేబుల్ దుబాసి రమేష్ పాల్గొన్నారు.

చిత్రం..పట్టుబబడిన రద్దయన పాత నోట్లు