రాష్ట్రీయం

బుల్లెట్ కన్నా గొప్పది బ్యాలెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: ప్రజాస్వామ్యంలో బులెట్ కన్నా బ్యాలెట్ చాలా గొప్పదని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సోమవారం నాడు హైదరాబాద్ హైకోర్టు ఆవరణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం ఉప రాష్టప్రతిని ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ వ్యక్తి గుణాన్ని, సామర్థ్యాన్ని చూసి ఎన్నికల్లో ఎన్నుకోవాలని అన్నారు. న్యాయవ్యవస్థ ఆధునికతను అందిపుచ్చుకోవాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కక్షిదారులకు చేరువ కావాలని చెప్పారు. జస్టిస్ కాకాసుబ్బారావు, జస్టిస్ జయచంద్రారెడ్డి, జస్టిస్ చిన్నప్పరెడ్డి, జస్టిస్ జీవన్‌రెడ్డి, జస్టిస్ రామస్వామి వంటి వారెంతో మంది సుప్రీంకోర్టులో సేవలకు ఈ హైకోర్టు అందించిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన న్యాయవ్యవస్థతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆంధ్రా యూనివర్శిటీ నుండి తాను న్యాయశాస్త్రంలో పట్ట్భద్రుడ్ని అయ్యానని చాలా కాలం క్రితం తాను ఇక్కడే న్యాయవాదిగా రిజిస్టర్ అయ్యానని పేర్కొన్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకున్నా, న్యాయనిర్ణేతగా ఉన్నానని అన్నారు.
బార్ ప్రతిష్టను పెంచిన ఎంతో మంది న్యాయవాదులు న్యాయవ్యవ్యస్థకే దిక్సూచిగా నిలిచారని అన్నారు. గొప్పగొప్పన్యాయవాదుల వల్ల ఈ హైకోర్టుకు ఎంతో పేరు దక్కిందని అన్నారు. దేశ ప్రజలు అందిరకీ సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం దక్కాల్సి ఉందని పేర్కొన్నారు. ధర్మ సాధనే కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద లక్ష్యం అని అన్నారు. ప్రజలు అంతా శాసన వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థల వైపే చూస్తున్నారని అన్నారు. ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచడమే ఈ వ్యవస్థల తుది లక్ష్యం కావాలని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ చైతన్యం ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కట్టుదిట్టమైన చట్టాలు, నియమనిబంధనలు రూపొందించుకున్నామని అయితే బార్ , బెంచ్‌లు ఎప్పటికపుడు స్వీయ సమీక్ష చేసుకోవాలని అన్నారు. న్యాయ పరిష్కార వ్యవస్థ ఇపుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ప్రజల విశ్వాసమే న్యాయపరిష్కార వ్యవస్థకు గీటురాయి అవుతుందని అన్నారు. దేశంలో జైళ్లలో 67 శాతం మంది విచారణ ఖైదీలేనని, 10 లక్షల మందికి 18 మంది న్యాయమూర్తులు ప్రస్తుతం ఉన్నారని, లా కమిషన్ సిఫార్సుల ప్రకారం 50 మంది ఉండాలని చెప్పారు.