రాష్ట్రీయం

టెక్నాలజీతో సిరుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 21: రైతాంగానికి ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో ఎక్కడున్నా రైతు మంగిటకు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేడు రైతు ఇంట సిరులు పండించేలా వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు. రైతు ఆత్మహత్యలు లేని నాడే వ్యవసాయంలో అభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డ ఆయన మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతాంగం కూడా వ్యవసాయంలో మెళుకువలు పాటిస్తూ రెండు పంటల దిశగా ముందుకు సాగాలన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం శాసన సభలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడుతూ గతంలో వ్యవసాయ రంగం అనేక అటుపోట్లను ఎదుర్కొందన్నారు. వ్యవసాయంలో నేడు ఖర్చు ఎక్కువ.. ఆదాయం తక్కువగా ఉన్నందున అనుబంధ రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంపై ఆధార పడిన మన రాష్ట్రంలో ఆహర భద్రతతోపాటు ఈ రంగంలో ఆర్థిక పరిపుష్టి కావాలన్నారు. దీనిలో భాగంగానే ముందుగా రైతాంగాన్ని అదుకునేందుకు
రుణమాఫీని చేసి చూపించామన్నారు. రుణ మాఫీతో రైతుకు కొంత ఆర్థిక వెసులుబాటు కలిగిందని అభిప్రాయపడ్డ ఆయన ఇదే సమయంలో వ్యవసాయరంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను కూడా కేటాయించామన్నారు. ప్రస్తుతం రైతాంగానికి 7 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్న ఆయన కొన్ని సందర్భాల్లో రైతులకు అవసరమైన ప్రాంతాల్లో మరో మూడు గంటల పాటు అదనంగా విద్యుత్‌ను అందించే విధంగా కలెక్టర్లకు స్పష్టమైన అదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వ్యవసాయంపై అధార పడి ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయంలో నూతన ఓరవడి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అగ్రీ వాచ్ ద్వారా వ్యవసాయ రంగాన్ని అధునీకరిస్తున్నట్లు తెలిపారు. అగ్రీవాచ్‌తో రానున్న అవసరాలు, పంట ఉత్పత్తులపై రైతులను ముందుగానే సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. 20 సంవత్సరాల క్రితం కుప్పంలో ఇజ్రాయిల్ పరిజ్ఞానంతో వ్యవసాయం చేసి కూరగాయలు పండించామని, ఇప్పుడు ఇటువంటి పరిజ్ఞానాన్ని రైతాంగానికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి టెక్నాలజీని జోడించడం ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి అవసరమైన సూక్ష్మ పోషకాలను రైతులకు అందిస్తున్నట్లు వివరించిన ఆయన ఇందుకోసం ఎంత ఖర్చయినా భరిస్తామన్నారు. విత్తనాలను కల్తీ చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను మరింత ప్రోత్సహించేందుకు రైతులకు అవసరమైన ప్రోత్సహకాలు ఇస్తున్నామన్న ఆయన ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని ధీమాగా చెప్పారు. 15 ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను ఇప్పటికే ప్రారంభించామన్నారు. వీటిని మరిన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదే సమయంలో ప్రతీ నవంబర్ నెలలో తుఫాన్‌లు వస్తున్నందున రైతాంగం ముందుగానే వ్యవసాయ పనులు పూర్తి చేసే విధంగా ఉండాలన్నారు. జూన్ నెలలోనే వ్యవసాయపనులు ప్రారంభించి అక్టోబర్‌కు పూర్తి చేసుకోవాలన్నారు. అలాగే ఏడాదిలో రెండు పంటలు వేసుకునే విధంగా ఎమ్మెల్యేలు వారికి అవగాహన కల్పించాలన్న ఆయన ముఖ్యంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలన్నారు. నాగార్జున సాగర్‌లో తక్కువ నీరు ఉన్నందున ఆరుతడి పంటలకు తక్కువ నీటి ద్వారా ఉత్పత్తి సాధ్యమని అభిప్రాయపడ్డారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిడమే తన అకాంక్షగా అభివర్ణించిన సిఎం బాబు అవసరమైన పక్షంలో సబ్సిడీపై మరిన్ని అధునిక యంత్రాలను రైతాంగానికి అందిస్తామని భరోసా కల్పించారు.

చిత్రం.. అసెంబ్లీ లో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు