రాష్ట్రీయం

ఏం చేస్తారో ముందు చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని ఇచ్చిన హామీని ఏమేరకు అమలు చేస్తున్నారో వివరించాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే రూ.16వేల కోట్లను భరిస్తామని ఏ ప్రాతిపదికన నిర్ణయించారని కోర్టు ప్రశ్నించింది. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు దాఖలు చేసిన పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జి శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. విభజన చట్టంలో ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును మొత్తం కేంద్రం భరిస్తుందని పేర్కొన్నారని, దీనిపై కూడా తీసుకుంటున్న చర్యలను వివరించాలని హైకోర్టు ఆదేశించింది. 2014 ఏప్రిల్ 1కి ఎంత మొత్తం వ్యయమవుతుందో అంచనా వేశారో అంతే మొత్తాన్ని భరిస్తామని కేంద్రం ప్రకటించడం అక్రమమని పేర్కొంటూ కేవీపీ ఈ పిల్ దాఖలు చేశారు.