రాష్ట్రీయం

ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి నరసాపురం, నవంబర్ 21: పడిపోయిన విద్యుత్ స్తంభం స్థానంలో కొత్త స్తంభం వేయడానికి రైతు నుంచి రూ.8000 లంచం తీసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం ట్రాన్స్‌కో ఏఈ వెంకటేశ్వరరావు మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కారు. ఏసీబీ ఏలూరు డీఎస్పీ వి గోపాలకృష్ణ కథనం ప్రకారం టి.నరసాపురం మండలం శ్రీరామవరానికి చెందిన రైతు బీరం కృష్ణమూర్తికి 373 నెంబరుగల విద్యుత్ సర్వీసు ఉంది. కృష్ణమూర్తితోపాటు మరో ఇద్దరు రైతులు బీరం సత్యం, పేరుబోయిన చినమహాలక్ష్మడుకు కలిపి 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చారు. ఈనెల 5న ట్రాన్స్‌ఫార్మర్ బిగించిన స్తంభం విరిగిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కృష్ణమూర్తి కుమారుడు శోభనాద్రి ట్రాన్స్‌కో ఏఈ వెంకటేశ్వరరావును కలిసి కొత్త స్తంభం వేయాలని కోరాడు. అయితే రూ.20వేలు లంచం ఇస్తే స్తంభం వేస్తాననటంతో శోభనాద్రి వెనుదిరిగాడు. ఏఈ ఆ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉన్న వైర్లు తొలగించి విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించారు. దీంతో శోభనాద్రి విద్యుత్ మోటారుకు సరఫరా నిలిచిపోయింది. నీరందే అవకాశం లేక పంట ఎండిపోతుండటంతో శోభనాద్రి మరోసారి ఏఈ వెంకటేశ్వరరావును కలిసి స్తంభం వేయమని కోరగా రూ.10వేలు ఇస్తే స్తంభం ఇస్తానని స్పష్టం చేశాడు. అయితే రూ.8000 ఇవ్వడానికి అంగీకరించిన శోభనాద్రి అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈమేరకు మంగళవారం ఉదయం ట్రాన్స్‌కో కార్యాలయంలో శోభనాద్రి నుండి రూ.8000 లంచం తీసుకుంటున్న ఏఈ వెంకటేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డిఎస్పీ గోపాలకృష్ణ వివరించారు. అతడిని అరెస్టుచేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు.