రాష్ట్రీయం

కొడిగట్టిన ‘సో’లాంతర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 21: కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న చేనేత కార్మికులకు విద్యుత్ బిల్లు భారం తగ్గిద్దామనే లక్ష్యంతో ప్రారంభించిన చేనేత ‘సోలార్ లాంతర్ల పథకం’ ఆదిలోనే కొడిగట్టింది. నాబార్డు సహకారంతో చేనేత కార్మికులకు సబ్సిడీతో కూడిన సోలార్ లాంతర్ల పథకానికి కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రూపకల్పన జరిగింది. రాత్రీ పగలు తేడాలేకుండా చేనేత కార్మికుల కుటుంబాలు మగ్గాలపై నేత పనిలో నిమగ్నమవుతుంటాయి. కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ అలా పనిచేస్తేనే వారికి పిడికెడు మెతుకులు దక్కుతుంటాయి. ఇలా నేత నేయాలంటే పూరి గుడిసెల్లో ఉండే చేనేత మగ్గాల వద్ద, మగ్గం గోతుల్లోను నిత్యం విద్యుత్ బల్బులు వెలగాల్సిందే. వీటివల్ల విద్యుత్ బిల్లుల భారం వారిపై భారీగానే పడుతుంటుంది. అలాంటి భారాన్ని తగ్గించే ఉద్దేశంతో సోలార్ లాంతర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. 2014లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పథకానికి ఉభయ గోదావరి జిల్లాలను ఎంపికచేశారు. రెండు జిల్లాల్లో ముందుగా 300 యూనిట్లు ఏర్పాటుచేయాలని సంకల్పించారు. ఆంధ్రప్రదేశ్ చేనేత అభివృద్ధి సంస్థ, సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) సంయుక్తంగా నాబార్డు సహకారంతో రూ.28 వేల ఖరీదుతో సోలార్ ల్యాంప్, ప్యానల్స్‌ను యూనిట్‌గా ఇవ్వడానికి రూపకల్పనచేశారు. ఇందులో 40 శాతం సబ్సిడీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం, చేనేత అభివృద్ధి సంస్థ 20 శాతం, మిగిలిన 20 శాతం చేనేత కార్మికుడు భరించాల్సివుంటుంది.
ఈ యూనిట్ల ఏర్పాటును విజయవాడకు చెందిన కుశలవ సోలార్ సంస్థకు అప్పగించారు. అయితే ఉభయ గోదావరి జిల్లాలను ఎంపిక చేసినప్పటికీ, తూర్పు గోదావరి జిల్లాలో కేవలం 130 యూనిట్లు ఏర్పాటుచేశాక పథకం అటకెక్కింది. రాష్ట్ర ప్రభుత్వంనుంచి గానీ, చేనేత అభివృద్ధి సంస్థ నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పథకం మూలనపడిపోయింది. దీనిపై నెడ్‌క్యాప్ అధికారులను ప్రశ్నిస్తే ఇది పూర్తిగా నాబార్డుకు సంబంధించిన పథకమని, ఆర్థికపరమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వం, చేనేత కార్పొరేషన్ చూసుకోవాల్సివుందని చెబుతున్నారు. చేనేత నాయకులను ప్రశ్నించగా 20 శాతం వాటా నిధులను సమకూర్చుకునే ఆర్థిక స్థోమత చేనేతల వద్ద లేదని చెబుతున్నారు. మొత్తం మీద చేనేత కార్మికులపై విద్యుత్ భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన పథకం ఆదిలోనే మూలనపడింది.