రాష్ట్రీయం

బిచ్చగాళ్లూ.. లక్షాధికార్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: హైదరాబాద్‌లో జరుగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచీ ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో, నగరంలో ఎక్కడా యాచకులు కనిపించ కూడదని జిహెచ్‌ఎంసి, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏరివేత కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్,
ప్రధాని మోదీతోపాటు దాదాపు 160 దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు సదస్సులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నగరంలోని బిచ్చగాళ్ల తరలింపులో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయ. పునరావాస కేంద్రాలకు తరలించిన యాచకుల్లో అత్యధికులు విద్యాధికులు, సంపన్నులే ఉన్నట్టు అధికారలులు గుర్తించారు. ఇప్పటి వరకు నగరంలోని 280మంది యాచకులను చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలోని ఆనందాశ్రమాలకు తరలించారు. వీరిలో ఇద్దరు యాచకులను విచారించగా కోటీశ్వరులని తేలింది. లంగర్‌హౌస్‌లో భిక్షాటన చేస్తూ జీవితం సాగిస్తుండగా.. జిహెచ్‌ఎంసి అధికారులు తమను ఇక్కడికి తీసుకువచ్చారని రుబియా, ఫర్జానా అనే ఇద్దరు మహిళలు జైలు అధికారులకు తెలిపారు. హైదరాబాద్‌లో ఇవాంక పర్యటన సందర్భంగా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించిన యాచకుల ఒక్కొక్కరి వివరాలు సేకరిస్తుంటే, లక్షాధికారులు, కోటీశ్వరుల వివరాలు బయటపడుతున్నాయ. ఇద్దరు మహిళల్లో ఒకరైన రూబియా తాను ఇంగ్లండ్‌లో ఉంటున్నానని, తనకు ఆస్తిపాస్తులు భారీగా ఉన్నాయని, మొక్కు తీర్చుకోడానికి హైదరాబాద్ వచ్చానని చెప్పారు. ఇక ఫర్జానా ఉండేది అమెరికాలో అని చెప్పింది. మనోవేదన నుంచి బయట పడేందుకు ఇక్కడకు వచ్చి దర్గా దగ్గర భిక్షాటన చేస్తూ బతుకుతున్నట్టు వివరించింది. అయితే వీరిద్దరూ హైదరాబాద్‌కు చెందిన వారేనని విచారణలో తేలిందని జైలు అధికారులు తెలిపారు. అదేవిధంగా నలుగురు ఎంబిఏ, ఇద్దరు బిఏ, ఎనిమిదిమంది ఇంటర్ చదివిన వారు కూడా ఉన్నారని, వారి ఊరి వాళ్లకు హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నామని చెబుతూ.. భిక్షాటనతో కాలం గడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు.
*
తిరిగి తిరిగి వీధులందు
తిరిపెమడిగి బతుకువారి దీనతజూడన్
పరితాపము కలుగుసరే,
వారే సంపన్నులవగ వాహ్వాయనమా!