రాష్ట్రీయం

28నే మెట్రో కూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: మహానగరవాసుల చిరకాల స్వప్నం మెట్రో రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రావటం దాదాపు ఖరారైనట్టే. మూడు కారిడార్ల మెట్రో రైలులో కారిడార్ 1లోని మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు, కారిడార్ 3లోని నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు మెట్రో ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సర్కారు, ప్రధాని కోసం చేస్తున్న నిరీక్షణకు తెరపడింది.
ముందుగా నిర్ణయించిన విధంగా ఈ నెల 28న హైటెక్స్ వేదికగా గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎకనామిక్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు మోదీ నగరానికి రానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానం దిగనున్న ప్రధాని, అక్కడినుంచి హెలికాప్టర్‌లో మియాపూర్ చేరుకుంటారు. అక్కడ తొలుత మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించి, తర్వాత మెట్రో రైలు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతం మియాపూర్‌లో అధికారులు హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. సంజీవరెడ్డినగర్ వరకు మెట్రో రైలులో ప్రయాణించనున్న ప్రధాని, ఎస్‌ఆర్ నగర్‌లో మెట్రో రైలు దిగి తిరిగి హెలికాప్టర్‌లో మళ్లీ మియాపూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ వేదికైన హైటెక్స్‌కు చేరుకుంటారు. మొత్తానికి మోది ఇరవై నుంచి 25 నిమిషాల వ్యవధిలో రెండు కార్యక్రమాలకు హాజరై తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు.
మెట్రో భద్రతపై కసరత్తు
మెట్రో రైలు, స్టేషన్లు, వాటి ఆవరణల్లో ప్రయాణికులకు కల్పించాల్సిన భద్రతపై రెండుసార్లు డీజీపీ మహేందర్‌రెడ్డి వద్ద ఉన్నతాధికారుల బృందం కసరత్తు చేసింది. ప్రస్తుతం ఈనెల 28న ప్రారంభం కానున్న రెండు కారిడార్లలో అమీర్‌పేట, ప్యారడైజ్ ఇంటర్‌చేంజ్ స్టేషన్లలో ప్రత్యేకంగా మెట్రో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేగాక, మెట్రో కోచ్‌లలో ప్రయాణించే మహిళలు, యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం 2 వేల 78 మంది పోలీసులు అవసరమంటూ మెట్రో రైలు డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరింది. అత్యాధునిక ప్రమాణాలతో, హైటెక్ పోలీసింగ్ వ్యవస్థతో మెట్రోకు భద్రత కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

చిత్రం..జెఎన్‌టియు వద్ద నెహ్రూ చిత్రంతో మెట్రో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం