రాష్ట్రీయం

ఏడాదిలో లక్ష కొలువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ ఆవిర్భావంతో తమకు ఉద్యోగాలొస్తాయని ఆశపడ్డ నిరుద్యోగులతో తిట్లు తినాలని మాకూ ఉండదని రాష్ట్ర మున్సిపల్, శాఖ మంత్రి కె. తారకరామారావు తీవ్రంగా స్పందించారు. ఏదైనా రాత్రికి రాత్రే చేసి శభాష్ అన్పించుకోవాలని మాకూ ఉంటుందని విపక్షాల విమర్శలపై ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మంగళవారం హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, మేయర్ బొంతురామ్మోహన్, బిజెపి ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, డా.కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇందులో భాగంగా చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన ఆయన గ్రంథాలయాభివృద్ధికి రూ. 5 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గవర్నమెంటు నియామకాలు అంటే కొన్ని చట్టాలు, నియమాలుంటాయని, వాటిని పాటించకతప్పదన్నారు. లేనిపక్షంలో ఎవరైనా కోర్టులను ఆశ్రయిస్తారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఎస్‌పిఎస్సీని ఏర్పాటు చేసి, రాజకీయాలకతీతంగా దానికి చైర్మన్‌ను నియమించామన్నారు. నియామకాలు సక్రమంగా జరగలన్నా ఉద్దేశ్యంతో సీఎం కెసిఆర్ ఎంతో ముందుచూపుతో చైర్మన్ పదవిని రాజకీయ నిరుద్యోగులకు కాకుండా బాధ్యతాయుతమైన ఓ ప్రొఫెసర్‌కు కేటాయించారని వివరించారు. కొన్ని సందర్భాల్లో నోటిఫికేషన్ల జారీ, నియామకాల్లో జాప్యం జరుగుతున్న విషయాన్ని మంత్రి అంగీకరించారు. నిరుద్యోగులకు ఇచ్చిన కమిట్‌మెంట్ ప్రకారం వందకు వందశాతం లక్షా 12 వేలలోపు
ఉద్యోగాలను ఏడాదిలోపు భర్తీ చేస్తామన్నారు. ఈ నియామకాల్లో 31 జిల్లాలకు చెందిన నిరుద్యోగులకు న్యాయం జరిగేలా నియామకాలు చేపడుతున్నామన్నారు. లక్ష పైచిలుకు పోస్టులను భర్తీ చేసిన తర్వాత కూడా అత్యధిక సంఖ్యలో నిరుద్యోగులు ఉంటారని, వారందరికీ ప్రైవేటు రంగంలోనూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున పరిశ్రమలను నెలకొల్పుతున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు.

చిత్రం..ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు రాజధాని బస్తీల్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్