రాష్ట్రీయం

కంటేనే అమ్మ అని అంటే ఎలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 21: ఆడశిశువులు భారమంటూ కన్నతల్లులు కర్కశ హృదయంతో పొత్తిళ్లలోనే ఆడబిడ్డలను వదిలేస్తుండ గా, అనాథలుగా శిశుగృహాలకు చేరుతున్న చిన్నారులకు విదేశీ వనితలు అమ్మ ఒడి పంచడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఖండాంతరా లు దాటి వచ్చి నల్లగొండ శిశుగృహంలోని అనాథ ఆడబిడ్డలను దత్తత తీసుకుంటున్న అమ్మతనం ఔన్నత్యానికి ఖండాంతరాల సరిహద్దులు దాసోహమంటున్నాయ. వివరాల్లోకి వెళ్తే ఇటీవల డెన్మార్క్‌కు చెందిన మహిళ మార్టిన్ తనకు పిల్లలు పుట్టే అవకాశం లేని పరిస్థితుల్లో ఆన్‌లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రకటన చూసి పిల్లల దత్తతకు దరఖాస్తు చేసుకుంది. నల్లగొండ శిశుగృహం నుంచి అనాథ ఆడబిడ్డను దత్తత తీసుకుని వెళ్లింది. ఇది జరిగిన పది రోజులకే ఆమెరికాకు చెందిన కార్మెన్ అలురేజ్ సైతం అమ్మతనం కోసం
తను దత్తత తీసుకోనున్న చిన్నారిని అక్కున చేర్చుకునేందుకు నల్లగొండ శిశుగృహంకు వచ్చింది. కార్మెన్ గత మార్చిలో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోగా ఆమెకు చిన్నారిని దత్తత ఇచ్చేందుకు అనుమతిస్తూ సెప్టెంబర్‌లో సమాచారం అందించారు. దీంతో కార్మెన్ ఏడాదిన్నర చిన్నారి నిహారికను తీసుకెళ్లేందుకు స్నేహితురాలితో కలిసి అమెరికా నుండి శిశుగృహంకు చేరుకుంది. శిశుగృహంలోనే ఉండి తనకు దత్తత ఇవ్వనున్న చిన్నారిని పొత్తిళ్లకెత్తుకుని పాలు, పండ్లు పెడుతూ ముద్దు మురిపెం చేస్తూ మురిసిపోయంది. నిబంధనల మేరకు దత్తత తీసుకునే తల్లి చిన్నారి ఆలనా పాలన చేసే తీరుపై కోర్టు సంతృప్తి చెందాకే చిన్నారిని తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలి. కాగా, మంగళవారం శిశుగృహం తనిఖీకి జిల్లా జాయింట్ కలెక్టర్ సి నారాయణరెడ్డి వెళ్లిన సందర్భంలో కార్మెన్ అలురేజ్ తన దత్తత చిన్నారిని లాలిస్తూ అమ్మతనం అనుభూతిని పొందుతూ కనిపించింది.

చిత్రం..దత్తత చిన్నారిని లాలిస్త్తూ మురిసిపోతున్న ఆమెరికా వనిత కార్మెన్ అలురేజ్, ఆమె స్నేహితురాలు