రాష్ట్రీయం

ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 21: పెళ్లి బాజా మోగాల్సిన ఇంట చావు బాజా మోగింది. కుమారుడి పెళ్లి పత్రికలను హైదరాబాద్‌లో పంచి తిరుగు ప్రయాణమైన తల్లిదండ్రులు, పెద్దమ్మ పెదనాన్నకు అదే మృత్యు ప్రయాణమైంది. అక్కాచెల్లెళ్లు, తోడళ్లుల్లు కలిసి ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో నలుగురూ దుర్మరణం చెందారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరు శివారులో మంగళవారం వేకువజామున ఈ హృదయ విదారక ఘటన సంభవించింది. ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని కుందనపల్లి ఐఓసీ సమీపంలోని రాజీవ్ స్వగృహ కాలనీకి చెందిన కామిడి రవీందర్ కాంబ్లే (55), అతని భార్య కామిడి సరితాభాయ్ (50), మహారాష్టక్రు చెందిన రఘునాథరావు (58), అతని భార్య
మీరాభాయ్ (53) మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం కామిడి రవీందర్ కాంబ్లే పెద్ద కుమారుడు రితీష్‌కు పెళ్లి కుదిరింది. ఈ సందర్భంగా వారి కులదైవమైన మహారాష్టల్రోని తుల్జాపూర్ భవానీమాత దర్శనానికి రవీందర్, అతని భార్య సరితాభాయ్ (టిఎస్ 02ఈజే 4433) నెంబరు కారులో మూడ్రోజుల క్రితం వెళ్లారు. అక్కడ భవానీమాత దర్శనం చేసుకున్న అనంతరం రవీందర్ తోడల్ల్లుడు ఉండే లాతూర్ వెళ్లి రఘునాథరావు, అతని భార్య మీరాభాయ్‌ని తీసుకుని కారులో హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌లో రవీందర్ బంధువులు, మిత్రులకు పెళ్లి కార్డులు అందించి సోమవారం అర్ధరాత్రి తరువాత రామగుండం వెళ్లేందుకు బయలుదేరారు. వేకువజాము సమయానికి కరీంనగర్ సమీపంలోని తిమ్మాపూర్ మండలం అల్గునూరు పెట్రోల్ బంక్ వరకు రాగానే బంక్ ఎదుట ఆగి ఉన్న (కెఎల్ 08బిహెచ్ 3824) నెంబర్ లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జుకాగా, కారులో ఉన్న రవీందర్‌రావు, సరితాభాయ్, మీరాభాబాయ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రఘునాథ్‌రావు కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానికుల సహాయంతో వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువులు, కుటుంబసభ్యులు, మిత్రుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ దద్దరిల్లింది. పెళ్లి కార్టులు పంచి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు దంపతులు మృత్యువాతపడటం అందరినీ కలిచివేసింది. పెళ్లి కుమారుడి తల్లిదండ్రులతోపాటు పెద్దమ్మ, పెద్దనాన్న మృతి చెందడంతో ఆ పెళ్లి ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిమ్మాపూర్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. కాగా, అల్గునూర్ ప్రమాద ఘటన పట్ల రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను ఓదార్చారు. రోడ్డు పక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నిలుపవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు లారీ డ్రైవర్లకు హెచ్చరికలు చేయాలని మంత్రి సూచించారు.

చిత్రం..ఆగి వున్న లారీ కిందకు దూరిపోయన కారు