రాష్ట్రీయం

నీటి నష్టాలపై అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వదిలిన నీటిలో 44 టిఎంసి నీరు తక్కువగా వస్తున్నట్లు వచ్చిన అభియోగాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు కమిటీలో నియమించే అధికారుల పేర్లను సూచించాల్సిందిగా రెండు రాష్ట్రప్రభుత్వాలను బోర్డు కోరింది. ఈ విషయమై బోర్డు లేఖలుర ఆసింది. డిఇఇ హోదాకు తగ్గని అధికారుల పేర్లను సూచించాలని బోర్డు లేఖలో పేర్కొంది. పవర్ హౌస్, స్పిల్‌వే నుంచి నాగార్జునసాగర్‌కు వదిలిన నీటిలో 44 టిఎంసి నీటి వరకు తేడా కనపడుతోందని ఈ నీరు ఎక్కడికి వెళ్లిందో తేల్చాలని తెలంగాణ అధికారులు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. సాధారణంగా నీటి విడుదల తర్వాత ఆవిరి నష్టాలు ఉంటాయి. కాని ఈ విషయంలో ఆవిరి నష్టాలతో సంబంధంలేకుండా నీటి మళ్లింపుజరిగిందా అనే కోణంలో కమిటీ విచారణ చేయాల్సి ఉంటుందని సాగునీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి.