రాష్ట్రీయం

మణుగూరు వరకు కొల్హాపూర్- హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: మహారాష్టల్రోని కొల్హాపూర్ నుంచి హైదరాబాద్-కొల్హాపూర్‌కు నడిచే నెంబర్ 11304/11303 రైలును ఖమ్మం జిల్లా మణుగూరు వరకు పొడిగించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. మారిన గమ్యస్ధానంతో ఈ రైలు వచ్చే ఏడాది మార్చి 14 నుంచి నడుస్తుందని తెలిపింది. కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్ ఛత్రపతి సాహు మహరాజ్ టెర్మినస్ నుంచి బయలు దేరి హైదరాబాద్‌లోని బేగంపేట రైల్వేస్టేషన్ వరకు యథాతథంగా చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ దక్కన్ (నాంపల్లి) రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి కాజిపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, భద్రాచలం రోడ్ మీదుగా మణుగూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలోనూ ఇదే రూట్లో ఆ రైలు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఒక్క హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్‌కు వెళ్లకపోవడం మినహా మిగిలినదంతా యథాతథమని రైల్వే వివరించింది. వచ్చేఏడాది మార్చి 18 వరకు మాత్రం ఈ రైలు హైదరాబాద్-కొల్హాపూర్ మధ్య ఇప్పుడు నడుస్తున్న రూట్లోనే నడుస్తుందని, ప్రయాణీకులు గమనించాలని వెల్లడించింది.

వచ్చేవారంలో కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ పనులు ప్రారంభం ఎంపీ రవీంద్రబాబు వెల్లడి

న్యూఢిల్లీ, నవంబర్ 22: కోనసీమ ప్రాంతానికి కీలకమైన కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ నిర్మాణ పనులను వచ్చేవారంలో ప్రారంభించనున్నట్టు అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు వెల్లడించారు. బుధవారం రవీద్రబాబు తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ కోటిపల్లి-నర్సాపురం రైల్వే ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జిల్లాల్లో పర్యాటకం రంగంతోపాటు, పారిశ్రామికభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, రైల్వే శాఖ మంత్రి హాజరుకానున్నట్టు ఆయన చెప్పారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లో ఓఎన్‌జీసీ, రిలయన్స్ సంస్థలు లక్ష కోట్ల ఇటీవలికాలంలో పెట్టుబడులు పెట్టినట్టు ఆయన చెప్పారు. ఓఎన్‌జీసీకి చైర్మన్‌గా ఎంపికైన శశిశంకర్ ఇటీవల కేజీ బేసీన్ పర్యటనకు వస్తే స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదని, కాకినాడ ఓఎన్‌జీసీ స్థానికి అధికారిగా ఉన్న ఆలోక్ నందన్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.