రాష్ట్రీయం

శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితురాలై, సర్వదేవతా పరివారంతో కదలివచ్చే పద్మావతీ అమ్మవారిని దర్శించుకుంటే భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. అలాగే జన్మాది దుఃఖాలు నశించి మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయ క్షేత్రాలలో తాత్త్విక బీజాలు విత్తే ఒక యజ్ఞం. కాగా అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరిదైన అశ్వవాహన సేవ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు సాగింది. కల్కి అవతారంలో అమ్మ భక్తులను అనుగ్రహించింది.