రాష్ట్రీయం

చిత్తూరులో క్లీన్‌స్వీప్ చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట), నవంబర్ 23: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్ రెడ్డి ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇక్కడ గురువారం సాయంత్రం ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో నల్లారి కిశోర్, ఆయన తనయుడు అమర్‌నాథ్‌రెడ్డి, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వారి అనుచరులకు పార్టీ కుండువాలు కప్పి టిడిపిలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేలా కృషి చేయాలన్నారు. పార్టీలో చేరిన కిశోర్ రాజకీయ భవిష్యత్‌ను తాను చూసుకుంటానని, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నల్లారి కుటుంబం ఎనిమిదిసార్లు ఎన్నికల్లో గెలిచిందన్నారు. ఆ కుటుంబమంటే తనకెంతో గౌరవ మర్యాదలున్నాయని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ మేలు కోసం ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్ రెడ్డి గట్టిగా పోరాడారని, రాష్ట్ర భవిష్యత్ కోసం కృషి చేశారని ప్రశంసల జల్లు కురిపించారు. జగన్‌లా కిరణ్‌కుమార్ రెడ్డి డ్రామాలు ఆడలేదని, విభజన సందర్భంగా కాంగ్రెస్‌ను ఎదిరించి బయటకు వచ్చారన్నారు. రాష్ట్ర విభజనపై సోనియా, జగన్ కపట నాటకమాడారని ఆయన ధైర్యంగా విమర్శించారని బాబు గుర్తుచేశారు. పార్టీలో చేరిన కిశోర్ నిత్యం ప్రజల మధ్య వుంటూ అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తుంటారని కితాబిచ్చారు. అసెంబ్లీ జరుగుతుంటే కుంటిసాకులతో పారిపోయే పరిస్థితి ప్రతిపక్షానిదని చంద్రబాబు చురకలంటించారు. కాగా, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి
చేస్తానని, జిల్లాలో అన్ని స్థానాల్లో అభ్యర్థులు గెలిచేలా పని చేస్తామని కిశోర్ చెప్పారు. రాష్ట్రం కోసం చంద్రబాబు పడుతున్న కష్టం చూసి, తనవంతు సేవలందించడానికి టీడీపీలో చేరానన్నారు. అంతకుముందు చిత్తూరు జిల్లా నుండి 500 కార్లలో 2వేల మంది అనుచరులతో ర్యాలీగా కిశోర్ విజయవాడ చేరుకున్నారు. బెంజిసర్కిల్ నుండి ఏలూరు రోడ్డులోని మారిస్ స్టెల్లా కళాశాల ఎదురుగా వున్న హోటల్ వద్దకు సీఎం చంద్రబాబు, కిశోర్‌తో కలిసి ఊరేగింపుగా చేరుకున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు వర్ల రామయ్య, చిత్తూరు జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్రం..నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి గురువారం టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు అభివాదం