రాష్ట్రీయం

ఇలా చేస్తున్నాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: మెట్రోరైలు, గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు జరుగుతున్న ఏర్పాట్లను గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వివరించారు. ప్రధాన మంత్రి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. అధికారికంగా ఖరారు అయిన ప్రధాన మంత్రి పర్యటన ఏర్పాట్లపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ నెల 28 సాయంత్రం బేగంపేట విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికిన అనంతరం హెలిక్యాప్టర్‌లో మియాపూర్ మెట్రోరైలు స్టేషన్‌లో ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి ఆ తర్వాత మెట్రోరైలును ప్రారంభించి కూకట్‌పల్లి వరకు ప్రధాని ప్రయాణించే వరకు చేసిన ఏర్పాట్లను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. మెట్రోరైలు ప్రారంభోత్సవం ముగిసిన అనంతరం హెచ్‌ఐసిసిలో జరిగే గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌ను ప్రధాని ప్రారంభించే వరకు ఖరారు చేసిన కార్యక్రమ వివరాలను గవర్నర్‌కు వివరించారు. ఆ రాత్రి కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రి అతిథులకు ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో ఇచ్చే విందు వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను వివరించారు. ఆ మరుసటి రోజు 29న అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లక్‌నుమా ఫ్యాలెస్‌లో ఇచ్చే విందుకు చేసిన ఏర్పాట్లను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు.
గట్టి భద్రత.. ఘన స్వాగతం
మెట్రోరైలు, గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానుండటంతో గట్టి భద్రత ఏర్పాట్లతో పాటు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈనెల 28న ప్రధాని పర్యటనను పురస్కరించుకుని గురువారం సచివాలయంలో డిజిపి మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు, సంబంధితశాఖల ముఖ్య కార్యదర్శులు, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, జిహెచ్‌ఎంసి కమిషనర్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు తదితరులతో సిఎస్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయాలు, మియాపూర్ మెట్రోరైలు స్టేషన్, హెచ్‌ఐసిసి, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను సిఎస్ సమీక్షించారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాన మంత్రికి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాన మంత్రికి గవర్నర్, ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు స్వాగతం పలుకుతారన్నారు. 28న సాయంత్రం మధ్యాహ్నం ప్రధాన మంత్రి మెట్రోరైలును ప్రారంభించిన అనంతరం హెచ్‌ఐసిసిలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించే ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారని వివరించారు. ఈ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుని సలహాదారు ఇవాంకా ట్రంప్ పాల్గొంటారని కూడా సిఎస్ వివరించారు. విదేశీ అతిథులు బస చేసే ప్రాంతంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు వచ్చే అతిథులకు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. సమ్మిట్‌కు వచ్చే అతిథులకు మొదటి రోజు ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో చివరి రోజు గోల్కొండ కోటలో ఇచ్చే విందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్ సింగ్ అధికారులకు సూచించారు.
ఇలా ఉండగా మెట్రోరైలు సమన్వయ కమిటీతో కూడా సిఎస్ ఎస్‌పి సింగ్ సమావేశమయ్యారు. ఈ కమిటీకి సిఎస్ చైర్మన్‌గా ఉన్నారు. మెట్రోరైలు ప్రారంభోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై మెట్రోరైలు ఎండి ఎన్‌విఎస్ రెడ్డితో చర్చించారు. ప్రధాన మంత్రి మెట్రోరైలు ప్రారంభించే మియాపూర్ స్టేషన్ నుంచి ఆయన ప్రయాణించే కూకట్‌పల్లి వరకు దారి పొడవునా మెట్రో స్టేషన్లను అందంగా ముస్తాబు చేయాలని సిఎస్ సూచించారు. మెట్రోరైలును 28న ప్రధాన మంత్రి ప్రారంభించాక ఆ మరుసటి రోజు నుంచి మెట్రోరైళ్లు ప్రారంభమవుతాయని ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. మొదట ఆరు నెలల పాటు పరిమిత సంఖ్యలోనే మెట్రోరైళ్లు నడుస్తాయని తెలిపారు.

చిత్రం..రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో గురువారం సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్