రాష్ట్రీయం

జీఎస్‌టీలో దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: వస్తు సేవా పన్ను ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది. పటిష్టమైన యంత్రాం గం, స్పష్టమైన విధి విధానాలను వర్తకులకు తెలియచేయడం, విస్తృతమైన ప్రచారంతో వస్తుసేవాపన్ను రాష్టమ్రంతా పాపులరైంది. ఈ ఏడాది జూలై 1వ తేదీన జిఎస్‌టి అమలులోకి వచ్చిన తొలి నెల మినహాయిస్తే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జిఎస్‌టి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది గడచిన మూడు నెలల్లో మొత్తం ఆదాయం రూ.9662 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే మూడు నెలల్లో వ్యాట్ పన్ను రూ. 8365 కోట్లు వచ్చింది. నిరుడిపైన ఈ ఏడాది గత మూడు నెలల్లో పన్ను ఆదాయంలో వృద్ధిరేటు 15 శాతం నమోదైంది. గత ఏడాది ఆగస్టులో వ్యాట్ వల్ల రూ. 2799 కోట్లు వస్తే, ఈ ఎడాది ఇదే కాలంలో రూ. 2958 కోట్లు రాగా వృద్ధి రేటు 5.6 శాతం నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్‌లో వ్యాట్ ద్వారా రూ. 2815 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది జిఎస్‌టి ద్వారా రూ. 3228 కోట్లు వచ్చింది. వృద్ధిరేటు 14.5 శాతం నమోదైంది. గత ఏడాది అక్టోబర్ నెలలో రూ. 2750 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ. 3475 కోట్ల ఆదాయం వచ్చింది. వృద్ధిరేటు 26.3 శాతం నమోదైంది. ఇటీవల 213 వస్తువులపైన జిఎస్‌టిని 28 శాతం నుంచి 18 శాతానికి, మరి కొన్ని వస్తువులపైన 12 నుంచి 5 శాతానికి తగ్గింది.తెలంగాణలో కొత్తగా 90 వేల మంది వర్తకులు జిఎస్‌టి పరిధిలోకి వచ్చారు. రాష్ట్రంలో మొత్తం 2.05 లక్షల మంది వర్తకులు తొలుత ఈ పన్ను విధానంలో ఉన్నారు.
జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత చెక్‌పోస్టుల ప్రాధాన్యత తగ్గింది. సరకులను రవాణా చేసే వర్తకులు ముందుగా జిఎస్‌టి చెల్లించడం వల్ల చెక్‌పోస్టుల వద్ద తనిఖీ అవసరం ఉండేది కాదు. పైగా జిఎస్‌టి విధానం పాపులర్ చేసేందుకు అధికారులు తనిఖీలు చేయలేదు. కాగా జిఎస్‌టి అమలు చేస్తున్నారా లేదా అనే విషయమై త్వరలో జిఎస్‌టి అధికారులు రాష్టవ్య్రాప్తంగా తనిఖీలను నిర్వహించనున్నారు. తనిఖీలు నిర్వహించేందుకు సంచార బృందాలను కూడా ఏర్పాటు చేశారు. జిఎస్‌టి చట్టంలో మొబైల్ బృందాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఉంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం జిఎస్‌టి అమలుపై వచ్చిన ఫిర్యాదులను అనుసరించి ఇచ్చిన ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఇంతవరకురాష్ట్ర వ్యాప్తంగా 15వేల తనిఖీలు చేసి 1335 కేసులను నమోదు చేశారు. రూ.44.35 లక్షల జరిమానాను వసూలు చేశారు. జిఎస్‌టి చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర స్ధాయి లో అధిక లాభాల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలి. కేంద్రం ఇప్పటికే జాతీయ స్థాయి అధిక లాభాల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్రప్రభుత్వం కూడా ఈ తరహా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చాలా మందికి ఈ కమిటీల గురించి తెలియదు. ఈ విషయమై విస్తృత ప్రచారం చేయాల్సి ఉంది. వినియోగదారులు ఈ కమిటీలకు జిఎస్‌టి సంబంధిత ఫిర్యాదులు చేయవచ్చు.