రాష్ట్రీయం

1.3 లక్షల మందికి గూగుల్ స్కాలర్‌షిప్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా భారత యువతను తయారుచేసేందుకు ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ముందుకు వచ్చింది. టెక్నాలజీ లెర్నింగ్ ప్లాట్‌ఫారం ఫ్లూరల్ సైట్ , విద్యాసంస్థ ఉడాసిటీతో కలిసి స్కాలర్‌షిప్‌లకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా 1.30 లక్షల మంది భారతీయ యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ స్కాలర్‌షిప్ కింద ప్లూరల్‌సైట్ టెక్నాలజీ వేదిక ద్వారా లక్ష మందికి, ఉడాసిటీ ద్వారా మరో 30వేల మందికి గూగుల్ స్కాలర్‌షిప్‌లను అందిస్తారు. వీటి ద్వారా దేశ యువత అత్యాధునిక సాంకేతిక విద్యను అభ్యసించడంతో పాటు మొబైల్, వెబ్ డెవలప్‌మెంట్ రంగాల్లో ఉద్యోగావశాకాలు పొందే వీలుంది. కృత్రిమ మేథస్సు, క్లౌడ్ ప్లాట్‌ఫారంలలో కూడా శిక్షణ అందిస్తారు. 20 లక్షల మంది డెవలపర్లకు తయారుచేసే లక్ష్యంతో గూగుల్ ఈ స్కాలర్‌షిప్‌ల కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచంలో భారత్ రెండో అతి పెద్ద కేంద్రంగా వృద్ధి పథంలో పయనిస్తోంది. 2021 నాటికి అమెరికాను అధిగమించే అవకాశం ఉందని గూగుల్ ప్రతినిధి విలియమ్ ఫ్లోరెన్స్ చెప్పారు. రానున్న మూడేళ్లలో దేశంలో కొత్తగా 20 లక్షల మంది అండ్రాయిడ్ డెవలపర్లకు గూగుల్ శిక్షణ ఇస్తుందని సిఈఓ సుందర్ పిచాయి గతంలో చెప్పారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం మొదలైంది.