రాష్ట్రీయం

చిన్న ఆలోచనలకే పెద్ద పీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు నిర్వహణకు ఒక పక్క భారీ ఏర్పాట్లు జరుగుతుండగా, మరో పక్క సదస్సులో నిర్వహించే సమావేశాలు, సమాంతర సమావేశాల ఏర్పాట్లు ఊపందుకున్నాయి. సమావేశంలో మాట్లాడే వారి జాబితా సిద్ధమైంది. సమాంతర సమావేశాలు రెండు పేర్లతో నిర్వహిస్తారు. అందులో ఒకటి బ్రేకవుట్ పేరుతో రెండోది మాస్టర్ క్లాస్ పేరుతో నిర్వహిస్తారు. ఇంకో పక్క వివిధ అంశాలపై వర్కుషాప్‌లు కూడా జరుగుతాయి. బ్రేకవుట్ సమావేశాల్లో 300 నండి 350 మందిని అనుమతిస్తారు. మాస్టర్ క్లాసు సమావేశంలో 150 మంది వరకూ అనుమతిస్కాతరు.
ఇక వర్కుషాప్‌ల్లో 40 మందిని అనుమతిస్తారు. ఇవన్నీ రోజూ జరిగే ప్లీనరీలకు సమాంతరంగా జరుగుతుంటాయి. 28న ప్రారంభ కార్యక్రమంలో అందరికీ అనుమతిస్తారు. 29 నుండి అసలు కార్యక్రమం మొదలవుతుంది. తొలి రోజు ప్లీనరీ సమావేశంలో మనం చేయగలం పేరుతో వక్తల ఉపన్యాసాలు మొదలవుతాయి. మానవ వనరుల అభివృద్ధి, కౌశలాల నైపుణ్య పెంపు ఎలా చేయాలనేదానిపై పలువురు మాట్లాడతారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెంచడం, వారి భాగస్వామ్యంతో ఆర్ధికాభివృద్ధి త్వరితం చెందడంపై చర్చ జరుగుతుంది.
చిన్న చిన్న ఆలోచనలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, ఆ చిన్న ఆలోచనలు ఆచరణలో ఎలా పెట్టారనే దానిపై చర్చిస్తారు. అలాగే సమాజాన్ని మార్చిన మహిళల ఆలోచనలకు ఈ సదస్సులో అగ్రతాంబూలం వేస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీని వినియోగించుకుని నెట్‌వర్కింగ్- గ్లోబల్ ఇన్నోవేషన్ అనే అంశంపై అమెరికాలవనూ, భారత్‌లోనూ వివిధ స్టార్టప్‌ల ఆగమనంపై చర్చ జరుగుతుంది. ఎప్పటికీ డబ్బుకు ప్రాధాన్యమే అనే అంశంపై బ్రేకవుట్ చర్చ జరుగుతుంది. ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు ఆకర్షించడం, తమ అంకురాల్లో వారి ఆర్ధిక భాగస్వామ్యం పెంచడంపై విజేతలు మాట్లాడతారు. తర్వాత జరిగే బ్రేకవుట్ సదస్సు ‘హాలీవుడ్ నుండి నాలీవుడ్ అక్కడి నుండి బాలీవుడ్’ అనే అంశంపై జరుగుతుంది. ఈ చర్చలో షారూక్‌ఖాన్ కూడా హాజరు కానున్నారు. సినీ చిత్రనిర్మాణంపై ఇందులో చర్చ జరుగుతుంది. మహిళలను సినీ పరిశ్రమలోని వివిధ విభాగాల్లో రాణించేలా ఏ విధంగా ప్రోత్సహించవచ్చో, వారికి ఉన్న అవకాశాలు ఏమిటో ఇందులో చర్చిస్తారు. తర్వాత మాస్టర్ క్లాసులో ‘ ఆమె అంటే వ్యాపారం’ అనే అంశంపైనా, తేలికగా పారిశ్రామిక ఔత్సాహికత, డిజిటల్ అగాధం, ఆరోగ్యరంగంలో అంకురాలు, సామాజిక మాధ్యమాలు , అగ్రిటెక్ పేరిట చర్చలు జరుగుతాయి. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత డిజిటల్ థింకింగ్, పెట్టుబడుల విజయం, నాకు తెలిసి ఉంటే నేనిపుడు తెలుసుకునేదేముంది అనే అంశాలపై చర్చలు జరుగుతాయి. అలాగే జార్జి జట్సన్‌తో ముఖాముఖి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల దూరదృష్టి, ప్రతి చోట జలం, చెల్లింపు వేదికలు, అభ్యసనం, ఎదుగుతున్న మార్కెట్లలో మహిళల పాత్ర అంశాలపై కూడా చర్చిస్తారు. ఈ సందర్భంగా దాదాపు వంద మందికి మాట్లాడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.