రాష్ట్రీయం

తెలుగు భాషను కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 23: తెలుగు భాషను కాపాడాలంటూ విశాఖలో గత 23 రోజులుగా జరుగుతున్న ఉద్యమం గురువారం మరింత ఊపందుకుంది. తెలుగు భాషను చంపేయకండి.. బతికించండి అంటూ విశాఖ నగరంలో తెలుగు తల్లి విగ్రహాన్ని పూల రథంలో ఊరేగించారు. ఈ శోభాయాత్రకు ముందు అనేక మంది తెలుగు భాష ఖ్యాతిని చాటుతూ నృత్యాలు చేశారు. తెలుగు భాష పరిరక్షణకు స్థానిక జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద తెలుగు దండు పేరుతో 23 రోజులుగా పరవస్తు చిన్నయ సూరి ఐదవ తరం వారసుడు పరవస్తు ఫణిశయన సూరి నేతృత్వంలో దీక్షలు కొనసాగుతున్నాయి. తెలుగు భాషను ప్రాథమిక విద్యలోనే విధిగా బోధించాలన్నది ప్రధాన డిమాండ్. పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు, ఆచార్య బి. ప్రసాద్, విశే్వశ్వరం, సింహాద్రప్పడు, సి.ఎస్.రావ్, సినీ నటుడు, విశే్లషకుడు, రచయిత రావికొండలరావు, వంగపండు ప్రసాదరావు తదితరులు గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ తెలుగే లేని తెలుగు రాష్ట్రాన్ని ఊహించుకోడమే కష్టంగా ఉందని అన్నారు. మాతృ భాష అయిన తెలుగును విద్యార్థులకు నేర్పాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాతృ భాషను దూరం చేయకండి అంటూ రోడ్డెక్కే పరిస్థితిని ప్రభుత్వాలు తీసుకువచ్చాయని అన్నారు. డాక్టర్ కూటికుప్పల సూర్యారావు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలు మాతృ భాషను ఏవిధంగా పరిరక్షించుకుంటున్నాయని, మన రాష్ట్రంలో మాతృ భాషను మృత భాషగా మార్చారని వ్యాఖ్యానించారు.