రాష్ట్రీయం

ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ( టీచర్ల నియామక పరీక్ష) నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్రప్రభుత్వం పునర్విభజన చేసిన 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని స్థానికత కోసం ఒక యూనిట్‌గా తీసుకుని నోటిఫికేషనన్ విడుదల చేయడం రాష్టప్రతి ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని హైకోర్టు ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వం జీవో 25 కింద ఇచ్చిన నిబంధనలను సవరించి పాత పది జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని టీచర్స్ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. స్ధానికత, విద్య, రిజర్వేషన్‌కు రాష్టప్రతి ఉత్తర్వులను ప్రాతిపదికగా తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. టెట్‌పై రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను సవాలు చేస్తూ జి అరుణ్‌కుమార్ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జి శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన టెట్‌కు సంబందించి నిబంధనలను, నోటిఫికేషన్‌ను రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన విషయం విదితమే.
రాష్ట్రప్రభుత్వం పునర్విభజన ద్వారా ఏర్పాటు చేసిన 31 జిల్లాలను కేంద్రప్రభుత్వ ఆమోదం లభించలేదని,రాష్టప్రతి ఉత్తర్వుల్లో ఈ ప్రస్తావన లేదని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణను డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించాలనితెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను ఆదేశించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్ రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 1975 రాష్టప్రతి ఉత్తర్వులు, రాజ్యాంగంలోని 371 డి అధికరణను ఉల్లంఘించి టెట్ రూల్స్‌ను రాష్ట్రప్రభుత్వం నోటిఫై చేసిందని కోర్టుకు తెలిపారు. రాష్టప్రతి ఉత్తర్వులు పాత పది జిల్లాలకు వర్తిస్తాయన్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు సంబంధించి జారీ చేసిన నిబంధనలను చట్టవిరుద్ధమని ప్రకటించాలని హైకోర్టును ఆయన కోరారు. అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, టీచర్ పోస్టులు జిల్లా కేడర్‌కు సంబంధించినవని, జిల్లా కేడర్ పోస్టులకు రాష్టప్రతి ఉత్తర్వులు వర్తించవని కోర్టుకు తెలిపారు. రాష్టప్రతి ఉత్తర్వులకు లోబడి రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచామన్నారు. జిల్లాల సంఖ్యను తగ్గిస్తే రాష్టప్రతి ఉత్తర్వులను ఉల్లంఘించినట్లవుతుందన్నారు. జిల్లాల సంఖ్యను పెంచడం వల్ల స్ధానికత ఉన్న అభ్యర్థులకు వచ్చే నష్టం ఏమీ ఉండదన్నారు. సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారమే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, ఈనెల 30వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ అని , పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుందని ఆయన కోర్టుకు తెలిపారు.