రాష్ట్రీయం

నేటి నుంచి ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వాదశికి టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 24: వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరానికి సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం కోసం ఆన్‌లైన్‌లో కేటాయించే టిక్కెట్లను శనివారం విడుదల చేస్తున్నట్లు టీటీడీ పౌరసంబంధాల శాఖ ముఖ్య అధికారి డాక్టర్ తలారి రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ద్వాదశి పర్వదినాన భక్తులు స్వామివారిని రూ.300 ప్రత్యేక దర్శనంలో దర్శించుకోవడానికి వీలుగా 5 వేల టిక్కెట్లను కేటాయించామన్నారు. 2018 జనవరి 1వ తేదీన రూ.300 టిక్కెట్లను పదివేలు ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం శనివారం ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.