రాష్ట్రీయం

విజయగాథల వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: హైదరాబాద్‌కు తలమానిక సదస్సుగా మారనున్న జీఈఎస్ ప్రపంచ మహిళా శక్తికి, యుక్తికీ కూడా వేదిక కాబోతోంది. భిన్న రంగాల్లో అద్భుత, అనన్య సామాన్య విజయాలు సాధించిన మహిళల విజయగాధలకూ ఇదే స్ఫూర్తిదాయక వేదిక. అవగాహన, ఆలోచనే విజయాలకు సోపానం. వాటిని పరస్పరం పంచుకుంటేనే అది స్ఫూర్తిదాయక విజయం..తమతో పాటు మరి కొందరూ అదే విజయబాటలో రాణించేందుకు తోడ్పడే విజయసూత్రం. అలాంటి విజయసోపానాలెన్నింటినో అధిరోహించిన వందలాది మహిళలకు జీఈఎస్ నిరుపమాన వేదికేననడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరు తోడుంటారనో, ఎవరు సహకరిస్తారనో, ఇది అసాధ్యం అనో భావించిన వారికి ఈ విజయగాథల్లో చోటు లేదు. కష్టమని తెలిసి అడుగు ముందుకు వేసిన వారే మిగిలిన వారికి మార్గదర్శకంగానూ, విజేతలుగానూ నిలిచారు. వారి విజయం తొలుత చిన్నదే కావచ్చు, అది అనేక ఇబ్బందులను , కష్టాలనూ దాటుకుంటూ సమస్యల వలయం నుండి బయటపడి గొప్ప అవకాశంగా మారిపోయిన సందర్భాలు అనేకం. కాబూల్ నుండి జీఈఎస్‌లో పాల్గొంటున్న ఒక మహిళ గాధ అలాంటిదే. సొంతగా వ్యాపారం చేసుకుంటూ ఎదగడం, నిలదొక్కుకోవడం ఆఫ్గన్ లాంటి
దేశంలో అసాధ్యం. అదీ మహిళ అయితే ఇంక చెప్పలేం. అఫ్సానా రహిమి ఎన్నో అడ్డంకులు అధిగమించింది. ఇపుడామె మీడియా మేనేజిమెంట్ ప్రొడక్షన్ కంపెనీ నడుపుతోంది. ఆఫ్గన్ మహిళా ఛాంబర్‌కు ఆమె అధ్యక్షురాలు కూడా. కాబూల్‌ల్లో ఉన్న కిలిద్ గ్రూప్ విస్తరణలో ఆమె ఎంతో కృషి చేసింది. ఒకే ఒక ఎఫ్ ఎం రేడియో స్టేషన్ బాధ్యత నుండి ఆమె దానిని 10 స్టేషన్లకు విస్తరించింది.
ఇంకో మహిళ జమ్మూకాశ్మీర్ నుండి సదస్సులో పాల్గొనబోతున్నారు. దామిని మహాజన్, ఆమె ముగ్గురు అబ్బాయిలకు తల్లి. సంప్రదాయ కుటుంబం నుండి వచ్చినా, వాటిని గౌరవిస్తూనే ఉయ్ మేక్ స్కాలర్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు లభించే విద్యావకాశాలు, స్కాలర్‌షిప్‌లు, రుణాలు, ఇతర సమాచారాన్ని అందించి వారికి తోడ్పడేందుకు ఆమె కృషి చేస్తున్నారు. ఇంజనీరింగ్ చేసిన మహాజన్ అమెరికా వెళ్లి మాస్టర్స్ డిగ్రీ చేసింది. తిరిగి భారత్‌కు వస్తూ హైదరాబాద్‌లో ఒక సంస్థ ఏర్పాటుచేయాలని తలపోశారు. తమ ఆలోచనను ఫేస్‌బుక్‌లో బీటా వెర్షన్‌లో ప్రారంభించింది. వెంటనే లక్ష మంది దానికి ఆకర్షితులయ్యారు. 200 దేశాలకు చెందిన 30 లక్షల మంది చైతన్యవంతులైన యువత ఈసంస్థ సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. ఏ సంస్థ నిర్వహించాలన్నా ముందు తమ పనిపై దృష్టి, ఆసక్తి, అభిరుచి, అనురక్తి ఉండాలని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు. ఎపుడూ యుద్ధాలతో అట్టుడికిపోయే దేశాల్లో సైతం మహిళలు ఎన్నో విజయాలు సాధించడం గమనార్హం. అఫ్సానా, దామిని వంటి వారు మిగిలిన మహిళలకు గొప్ప చైతన్య దీపికలు కాబోతున్నారు.