రాష్ట్రీయం

సాంకేతిక లోపంతో కూలిన శిక్షణ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/ కొండపాక, నవంబర్ 24 : సాంకేతిక లోపంతో ఎయిర్ జెట్ శిక్షణ విమానం కూలిపోయన సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ వద్ద శుక్రవారం జరిగింది. శిక్షణ పొందుతున్న పైలట్ రాశీ రేహనా ప్యారాచూట్ సహాయం తో కిందకు దూకటంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని హకీంపేట వాయుసేన శిక్షణ కేంద్రానికి చెందిన ఎయిర్ జెట్‌లో ట్రైనీ పైలట్ రాశీ రేహనా కొండపాక ప్రాంతానికి వచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో సాంకేతిక లోపంతో విమానం కూలిపోవడంతో విమాన శకలాలు చెల్లాచెదరుగా పడ్డాయ. రేహనా ప్యారాచూట్ విమానం నుండి దూకడంతో ఆమెకు ప్రాణగండం తప్పింది. ఆమెకు సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరంహైదరాబాద్ తరలించారు. హకీంపేట నుండి మారో రెండు హెలికాప్టర్లలో అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకొని తునకలైన శిక్షణ విమానాన్ని పరిశీలించి, ప్రమాదానికి కారణాలను ఆరా తీస్తున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్, అడిషనల్ డీసీపీ నర్సింహరెడ్డి, ఏసీపి బాలాజీ శిక్షణ విమానం కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. విమానం కూలినప్పుడు అందులో ముగ్గురు ఉన్నట్టు ప్రచారం జరిగినా, అందులో ఒక్కరే ఉన్నట్టు పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఈ సంఘటనపై కుకునూర్‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..కూలిన ప్రాంతంలో మంటలు చెలరేగుతున్న దృశ్యం