రాష్ట్రీయం

కాళేశ్వరం కొలిక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో మైలురాయిని దాటింది. కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ నుంచి శుక్రవారం అంతిమ అనుమతి లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టును కోర్టు కేసులతో అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు, శక్తులకు ఇది చెంపపెట్టు అని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిగతా శాఖల నుంచి ఇంకా రావాల్సిన అనుమతులను కూడా త్వరితగతిన సాధించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గడిచిన 15 రోజుల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్, అంతరాష్ట్ర అనుమతి, కేంద్ర భూగర్భ జలశాఖ, కన్‌స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీ అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు పరిధిలో పర్యావరణ ప్రభావిత మదింపు అంచనాకు సంబంధించి టర్న్ ఆఫ్ రిఫరెన్స్ రావడంతో తెలంగాణలోకి 15 జిల్లాల్లో, మహారాష్టల్రోని గడ్చిరోలీ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఇప్పటికే పూర్తి అయింది. అటవీ భూములకు సంబంధించి కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ నుంచి మొదటి దశ అనుమతులు గతంలోనే లభించాయి. ఈ ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయడానికి రెండు రోజుల కిందట ఢిల్లీకి వెళ్లిన మంత్రి హరీశ్‌రావు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మంత్రి నితిన్ గడ్కారీతో పాటు కేంద్ర జల సంఘం ఉన్నతాధికారులతో జరిపిన మంత్రాంగం సత్ఫలితాలని ఇచ్చిందని చెప్పవచ్చు. కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ మొదటి దశ అనుమతిని అక్టోబర్ 24న జారీ చేసింది. టనె్నలు, పంప్ హౌజ్‌లు, సర్జ్ఫూల్స్, జలాశయాలు, డెలివరీ సిస్టెర్న్ తదితర వాటి కోసం 8182 ఎకరాల అటవీ భూమిని వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చింది. కేటాయించిన అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా అటవీ సంపదను పెంచడానికి అయ్యే ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.723 కోట్లను కేంద్ర అటవీశాఖకు చెల్లించింది. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇతర ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా మలచడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దీనికి రీ-డిజైన్ చేయించారు. దీని వల్ల లోయర్ మానేరు డ్యామ్‌కు జీవం పోసి, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు పునర్జీవం కల్పించడానికి ముఖ్యమంత్రి వ్యూహం ఫలించింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు డిజైన్ చేసినప్పుడు తుమ్మిపిహట్టి వద్ద బ్యారేజి నిర్మాణం జరగాల్సి ఉంది. అయితే అక్కడ బ్యారేజి నిర్మించడం వల్ల తమ భూ భాగం ముంపునకు గురవుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. తక్కువ ముంపు, ఎక్కువ లాభం, అధిక ఆయకట్టుకు నీరు అందించడానికి బ్యారేజి స్థలాన్ని తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చేలా ప్రాజెక్టుకు రీ-డిజైన్ చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఒప్పించారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సానుకూలంగా మలచడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కృతకృత్యులయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 18.25 లక్షల కొత్త ఆయకట్టుతో పాటు మరో 18.82 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. మేడిగడ్డ బ్యారేజి నుంచి ఎత్తిపోతల ద్వారా అన్నారం, సుందిల్ల బ్యారేజిల ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించనున్నారు. మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్, గంధిమల్ల రిజర్వాయర్లను నింపి ఆయకట్టుకు నీరు అందించనున్నారు. దీని వల్ల 142 టిఎంసిలకు పైగా గోదావరి జలాలను నిల్వ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పటికీ రెండు పంటలకు సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది జూన్ నాటికి మధ్యమానేరు ప్రాజెక్టును కాళేశ్వరానికి ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తారు. అలాగే శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు అనుసంధానం చేయడానికి ఇటీవల రూ.వేయ్యి కోట్లను ప్రభుత్వం మంజురు చేసింది. ఈ అనుసంధానం వల్ల శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు కింద 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలు పండించుకోవడానికి అవకాశం కలుగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చేలా డిజైన్ చేసారు.