రాష్ట్రీయం

14 లక్షల ఖాళీలను భర్తీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆర్. కృష్ణయ్య శుక్రవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా రైల్వేలో 3.5 లక్షలలు, 21 జాతీయ బ్యాంకుల్లో 2 లక్షల 25 వేలు, 244 ప్రభుత్వ రంగ సంస్థల్లో 3 లక్షల 20 వేలు, రక్షణ శాఖలో 3 లక్షలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల బిసి సంక్షేమ సంఘం నాయకులు కలిసినప్పుడు ప్రధాని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.