రాష్ట్రీయం

పొలం పనులకు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 24: మారుతున్న కాలానికి అనుగుణంగా పొలం పనులకు వెళ్ళే గ్రామీణ కూలీలు కూడా తగ్గుతున్నారు. ఒకప్పుడు సాగులో మహిళలే కీలకంగా ఉండగా మారుతున్న ఆధునిక యుగంలో వారు దానిపట్ల ఆసక్తి కనబర్చడం లేదు. నీతి అయోగ్ అధ్యయనంలో కూడా ఇదే విషయం స్పష్టమైంది. నీతి అయోగ్ ఇటీవల ఆయా రాష్ట్రాలలో జరిపిన అధ్యయనంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గ్రామీణులు వ్యవసాయ పనులకు దూరంగా ఉండేందుకే ఇష్టపడుతున్నారని స్పష్టమైంది. సాగునీటి వనరులు ఉన్నప్పటికీ వారు వ్యవసాయం కంటే ఇతర మార్గాల్లో ఉపాధి పొందేందుకే ఆసక్తి చూపుతున్నారని నివేదిక తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో సాగు వనరులు పెంచుతూ పంట భూములను అధికం చేస్తున్న నేపథ్యంలో మహిళా కూలీల కొరత వ్యవసాయానికి ఇబ్బందిగా మారింది. ప్రధానంగా నాగార్జునసాగర్, ఏఎంఆర్, ఎస్‌ఆర్‌ఎస్‌పి లాంటి ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. అలాగే రాష్ట్రంలో అధికంగా బోర్లు, బావుల ద్వారా వ్యవసాయం జరుగుతోంది. అయితే పిల్లల చదువులకు తోడు వ్యవసాయం పట్ల పెరుగుతున్న అనాసక్తత కూలీల కొరతకు కారణంగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ఓ ఉమ్మడి కుటుంబంలో రెండేళ్ళ క్రితం అందరూ కలిసి వ్యవసాయం చేసేవారు. నేడు కూలీల కొరత కారణంగా ఆ కుటుంబమంతా కలిసి పనులు చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఇందులో మహిళలు పొలాలకు రాకపోవడం విశేషం. మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఏడెకరాల పొలం ఉండగా రెండేళ్ళ క్రితం వరకు వ్యవసాయం చేసిన వారు కూలీల కొరతతో పొలాన్ని బీడుగా పెట్టి వరంగల్ జిల్లా కేంద్రానికి చేరుకొని కూలీపని చేసుకుంటున్నారు. రాష్టవ్య్రాప్తంగా అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నది. 20నుంచి 35ఏళ్ళలోపు ఉన్న మహిళలు గతంలో 75శాతం వ్యవసాయ పనిలో ఉంటుండగా ప్రస్తుతం 20శాతం కంటే తక్కువగానే ఉంది. అలాగే 25నుంచి 35ఏళ్ళలోపు పురుషులు కూడా గతంలో 90శాతం వ్యవసాయ పనులకే పోతుండగా ప్రస్తుతం అది 30శాతం లోపు ఉన్నదని నివేదిక స్పష్టం చేస్తున్నది. పిల్లల చదువులు, వారి స్నేహాలు, పరిచయాల ప్రభావం తల్లిదండ్రుల వృత్తిపై పడుతుండగా, ఇంట్లో సంపాదనకు ఎదిగిన పిల్లలు ఉండటంతో మరికొంతమంది పొలం పనులు నామోషీగా పరిగణిస్తున్నారు. మరికొంతమంది గిట్టుబాటుకాని వ్యవసాయం దండగంటూ ఇతర రంగాల్లోకి ఉపాధికి వెళ్తున్నారు. మరికొంతమంది పిల్లల చదువులకు వ్యవసాయం ద్వారా రాబడి ఉండదనే కారణం చూపుతూ సమీపంలోని పట్టణాలకు తరలిపోతున్నారు.