రాష్ట్రీయం

‘మన గుడి’ నుంచి సనాతన ధర్మప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 24: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార కార్యక్రమంలో మనగుడి కార్యక్రమానికి ప్రత్యేక స్థానం ఉందని, సనాతన ధర్మాన్ని మరింతగా వ్యాప్తిచేసేందుకు ఇది దోహదపడుతుందని టీటీడీ ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఉదయం మనగుడి పూజాసామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ మనగుడి పూజాసామగ్రిని శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం ఇఓ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ధర్మప్రచార కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 300 ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అక్షింతలు, పసుపు, కుంకుమ, కలకండ, పుస్తకప్రసాదం, కంకణాలతో కూడిన పూజాసామగ్రిని శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ పూజాసామగ్రిని ఎంపిక చేసిన ఆలయాలకు చేరవేస్తామన్నారు. డిసెంబర్ 1న ఆలయ శోభ, 2న కృత్తిక దీపోత్సవం, నగర సంకీర్తన, స్థానిక భజన బృందాలతో భజనలు, 3వ తేదీన దత్తజయంతిని పురస్కరించుకుని గురుపూజ నిర్వహించనున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో 500 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఇందుకోసం ఇప్పటికే రూ.10 కోట్ల నిధులు మంజూరు చేశామని ఇఓ తెలిపారు. ఏజన్సీ ప్రాంతాలైన అరకు, రంపచోడవరం, పార్వతీపురం, సీతంపేటలో రూ.4.5 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. టీటీడీ సమాచార కేంద్రాలు గల నగరాల్లో ఆలయాల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భువనేశ్వర్‌లో టీటీడీ సమాచార కేంద్రం, కల్యాణ మండపం ఉన్నాయని, భక్తుల కోరిక మేరకు త్వరలో అక్కడ శ్రీవారి ఆలయం నిర్మిస్తామని తెలిపారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ప్రాజెక్ట్ అధికారి రమణప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.