రాష్ట్రీయం

నటుడు మీగడకు లోక్ నాయక్ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం , నవంబర్ 24: లోక్‌నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారానికి (2018) ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు మీగడ రామలింగస్వామిని ఏంపిక చేసినట్లు లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విశాఖలో శుక్రవారం లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పురస్కారాన్ని 2018 జనవరి 20న కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ లావునాగేశ్వరరావు చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేస్తామన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, హరివంశ్‌రాయ్ బచ్చన్‌ల వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ పురస్కారం కింద లక్షాయాభైవేల నగదు, జ్ఞాపికను అందజేస్తామన్నారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి విశేష సేవ చేసిన సందర్భంగా ఈ అవార్డును అందజేస్తున్నామన్నారు. నటుడిగా, రచయితగా, దర్శకునిగా తెలుగునాట సుప్రసిద్ధులైన మీగడ రామ లింగస్వామికి అవార్డును అందజేయాలని జ్యూరీ బోర్డు నిర్ణయించిందన్నారు.