రాష్ట్రీయం

నల్లద్దాల మాటున..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), నవంబర్ 27: బెజవాడ అంటేనే బేఖాతరిజం. సర్కారు ఎన్ని సంస్కరణలు పెట్టినా బెజవాడలో తప్ప అన్నిచోట్లా అమలవుతుంది. రాష్టమ్రంతా రోడ్డు వెడల్పు చేస్తుంటే బెజవాడలో మాత్రం అధికారులు ఆ సాహసం చేయరు. కారణం.. భయం. రాజకీయ నేతలపై నుంచి వచ్చే ఒత్తిళ్లు. కోర్టు తీర్పులయినా అంతే. అందుకే బెజవాడ రూటే సెపరేటు. కార్లకు బ్లాక్ ఫిలిం స్టిక్కర్లను తొలగించాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా బెజవాడలో మాత్రం బ్లాక్‌ఫిలిం స్టిక్కర్లున్న కార్లు ట్రాఫిక్ పోలీసు, రవాణా శాఖ సిబ్బంది ఎదురుగా యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇదీ రాష్ట్ర రాజధాని నగరమైన విజయవాడలో బ్లాక్‌ఫిలిం స్టిక్కర్ల బేఖాతరు పర్వం!
దేశమంతటా కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిమ్ స్టిక్కర్ల నిషేధం అమలులో ఉంటే, నవ్యాంధ్ర రాజధానిలో ఆ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిమ్ ఉపయోగించడం వలన ఎవరికి తెలియకుండా నేరాలు, ఘోరాలు చోటు చేసుకోవడంతో, సుప్రీంకోర్టు 2012 మే నాలుగవ తేదీన కార్లకు బ్లాక్ ఫిలిమ్‌ను వాడరాదంటూ కఠినమైన తీర్పునిస్తూ, దానిని దేశమంతటా అమలు చేయాలని ఆదేశించింది. దానితో ప్రభుత్వ వాహనాల దగ్గర నుంచి ప్రైవేటు వాహనాల వరకు ఈ ఫిలిమ్‌ను తొలగించారు. హైదరాబాద్‌లో అయితే, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు చేతిలో బ్లేడ్లు పట్టుకుని మరీ తొలగింపు వ్యవహారాన్ని
ఓ ఉద్యమంలా పూర్తి చేశారు. ఈ తీర్పుతో అన్ని రాష్ట్రాల్లో ఈ నిషేధాన్ని తు.చ తప్పక అమలు చేస్తున్నారు.
మోటారు వెహికల్ చట్టం ప్రకారం 70 శాతం క్లియర్‌గా కనిపించే విధంగా, అదే ఇరువైపులా యాభై శాతం ఉండాలని సుప్రీంకోర్టు సూచనలిచ్చింది. ఈ విధానాన్ని పరిగణలోకి తీసుకొని పోలీసు శాఖను హెచ్చరించింది. కార్లకు బ్లాక్ ఫిలిమ్ వలన అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు తావులేకుండా ఈ తీర్పునిచ్చింది. ఢిల్లీలో ఓ విద్యార్థినిపై కారులో జరిగిన హత్యాచార సంఘటన దృష్ట్యా, సుప్రీం కోర్టు
ఈ తీర్పునిచ్చి అమలు చేయాలని ఆదేశించింది.
ఆ తరువాత కొద్ది నెలలకే విజయవాడ నగరంలో ప్రముఖ బీసీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త పలగాని ప్రభాకర్ కూతురు కిడ్నాప్ జరిగింది. అనంతరం కొన్ని గంటల వ్యవధిలో ఆ బాలికను దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత మరో ప్రముఖుడు బోను దుర్గా నరేష్ కూతురు కిడ్నాప్ వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి సంఘటనలకు తావులేకుండా ఉండటం కోసం ఆ నాడు బ్లాక్ ఫిలిమ్‌ని నిషేధిస్తూ కొద్ది రోజులు అమలు చేశారు. తరువాత పరిస్థితి మామూలే. ఆంధ్ర రాష్ట్ర రాజధాని నగరంగా ఉన్న విజయవాడలో ఈ నిషేధం అమలుకు నోచుకోకపోవడం పట్ల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులో బ్లాక్ ఫిలిమ్ వినియోగంలో ఎవరికీ ప్రత్యేక అనుమతి లేదంటూ స్పష్టంగా పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లో అధికార, అనధికార వాహనాలు ఈ నియమాన్ని విధిగా అమలు చేస్తున్నా, రాష్ట్ర రాజధానిలో మాత్రం అమలు జరగకపోవడం, ఆర్టీఓ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో ఖరీదైన కార్లు బ్లాక్‌ఫిలిం స్టిక్కర్లతో బేఖాతరుగా రోడ్లమీద కనిపిస్తున్నాయి. టికెల్‌రోడ్, బెంజ్‌సర్కిల్, మొగల్రాజపురం, కరెన్సీనగర్, గురునానక్‌నగర్, అశోక్‌నగర్, పటమట వంటి ప్రాంతాల్లో ఇవి దర్శనమిస్తున్నాయి. ఈ విషయంలో రవాణాశాఖ అధికారులు, పోలీసు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.