రాష్ట్రీయం

సాకారమవుతున్న కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: భాగ్యనగరవాసుల దశాబ్దంనాటి కల నేడు సాకారం కాబోతోంది. చారిత్రక హైదరాబాద్ నగరవాసులు ఎదురు చూస్తోన్న మెట్రోరైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చే తరుణం ఆసన్నమైంది. మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు మియాపూర్ మెట్రో రైలు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన అనంతరం అక్కడి నుంచి కూకట్‌పల్లి వరకు (5కి.మీ) ప్రయాణించడం ద్వారా అధికారికంగా మెట్రోరైలు ప్రారంభమవుతుంది. దేశంలోని ఐదు మహా నగరాలకుగాను ఇప్పటికే నాలుగింటిలో అందుబాటులోకి వచ్చిన మెట్రోరైలు, ఐదవ మహానగరమైన హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి వచ్చినట్టవుతోంది. హైదరాబాద్ మెట్రోరైలుకు సరిగ్గా దశాబ్దం కిందట 2007లో అంకుర్పారణ జరిగింది. అప్పటి నుంచి ఐదేళ్లలో పూర్తి కావాల్సిన మెట్రోరైలు ప్రాజెక్టుకు ఎదురైన అనేక అవాంతరాలు, బాలారిష్టాలను అధిగిమించి ఎట్టకేలకు దశాబ్దం తర్వాత 2017 నవంబర్‌లో పట్టాలపై పరుగులు తీసేందుకు సిద్ధమైంది. మొదట ఈ ప్రాజెక్టును మైటాస్ సంస్థకు 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర అప్పగించింది. అయితే ఏడాది గడిచినా ప్రాజెక్టు పనులను సదరు సంస్థ చేపట్టకపోవడంతో మైటాస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి గ్లోబల్ టెండర్ల ద్వారా పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్ (పిపిపి) విధానంలో సెప్టెంబర్ 2010లో ఎల్ అండ్ టి సంస్థకు అప్పగించింది. మొత్తం మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల మెట్రోరైలు మార్గం నిర్మాణానికి ఎల్ అండ్ టి సంస్థ రూ. 14,132 కోట్ల ఖర్చు చేయడానికి ఒప్పందం చేసుకోగా, దీనికి అవసరమైన భూ సేకరణ, రహదారుల విస్తరణ, ఇతర వౌలిక సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.3000 కోట్లు, ఫండ్ గ్యాప్ కింద కేంద్రం రూ.1458 కోట్లు ఖర్చు పెట్టేలా ప్రాజెక్టును చేపట్టారు. ఒప్పందం ప్రకారం ఐదేళ్లలో ప్రాజెక్టు మొత్తం పూర్తి చేసేలా, పాక్షికంగా మొదటి దశ మార్గం 2014 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే మెట్రోరైలు నిర్మాణ పనులు ఏడాది ఆలస్యంగా 2011లో ప్రారంభమైన సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైంది. మెట్రోరైలు వెళ్లే మార్గంలో చారిత్రక, వారసత్వ కట్టడాలను తొలగించడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో అలైన్‌మెంట్ వివాదంతో పనులు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ రాజధానిగా ఉండటం వల్ల మెట్రోరైలు కాంట్రాక్టు కుదుర్చుకున్నామని, రాష్ట్ర విభజన జరిగితే 10 జిల్లాల తెలంగాణకు రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో కాంట్రాక్టు తమకు గిట్టుబాటు కాదని ఎల్ అండ్ టి సంస్థ చేతులెత్తేస్తూ కేంద్రానికి లేఖ రాయడం మరో వివాదమైంది. ఈ నేపథ్యంలో గడువు మేరకు 2015లో పూర్తి కావాల్సిన మెట్రోరైలు ప్రాజెక్టు రెండేళ్ల జాప్యం తర్వాత మొదటి దశలో 30 కి.మీ మార్గానికి (నాగోల్- మియాపూర్) ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం ప్రారంభోత్సవం చేయనుండగా ప్రయాణికులకు బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి అందుబాటులోకి రానుంది. ఇలాఉండగా మెట్రోరైలు నిర్మాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభం కాగా తెలంగాణ రాష్ట్రంలో తెరాస హయాంలో ప్రారంభం కావడం విశేషం. ఈ నేపథ్యంలో మెట్రోరైలు ప్రాజెక్టు క్రెడిట్ తమదేనని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శిస్తుండగా, క్రెడిట్‌లు, డెబిట్‌లు ఎవరిదన్నదీ ప్రజలే తేలుస్తారని మున్సిపల్ మంత్రి కె తారకరామారావు తిప్పికొట్టారు. మెట్రోరైలు ప్రారంభమయ్యే శుభ సమయాన చిల్లర రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు మంత్రి కెటిఆర్ హితవు పలికారు.