ఆంధ్రప్రదేశ్‌

తుని విధ్వంసం బాధించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: తుని కాపుగర్జన సదస్సులో చోటు చేసుకుంటున్న సంఘటనలు తనను బాధించాయని సినీనటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. కేరళలో సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన దాన్ని అర్థంతరంగా ముగించుకుని సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. తుని ఘటనలు, కాపుసామాజిక వర్గాన్ని బిసిల్లో చేర్చాలన్న డిమాండ్ తదితర అంశాలపై మీడియాతో మాట్లాడనున్నారు. పవన్ కల్యాణ్ కూడా కాపుసామాజికవర్గానికి చెందిన వ్యక్తి. గత ఎన్నికల్లో టిడిపి-బిజెపి తరఫున ఆంధ్ర రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో కాపువర్గం ఓట్లు ఈ కూటమికి పడ్డాయి. ముద్రగడ పద్మనాభం కాపుగర్జన సందర్భంగా రాస్తారోకోకు పిలుపునిచ్చారు.ఈ పిలుపుహింసాత్మకంగా మారింది. అనంతరం ముద్రగడ సోమవారం సాయంత్రంలోగా కాపులను బిసిల్లో చేర్చుతూ జీవో ఇవ్వకపోతే ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ చేసే ప్రకటన, కాపునాడు ఉద్యమంపై ఎటువంటి వైఖరి తీసుకుంటారనే విషయం సర్వత్రా ఆసక్తిగా మారింది.

ఉలిక్కిపడ్డ విజయవాడ

నగర వీధుల్లో సాయుధ పోలీసు పహరా నన్ను మాట్లాడించకండి: వంగవీటి రాధా

విజయవాడ, జనవరి 31: కాపుగర్జన సందర్భంగా ఊహించని రీతిలో తుని పట్టణంలో జరిగిన హింసాత్మక దుర్ఘటన రాష్ట్ర రాజధాని విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత చేదు అనుభవాల దృష్ట్యా ముఖ్యంగా వ్యాపార వర్గాలు అప్రమత్తమయ్యాయి. క్షణాల్లో సాయుధ పోలీసు బలగాలు కూడా ప్రధాన రహదారుల కూడలి ప్రాంతాల్లో మోహరించాయి. ఏక్షణాన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతతో ప్రజలు గడిపారు. ఇక రైల్వే, బస్‌స్టేషన్‌లలో ప్రయాణికులు కలవరం చెందారు. కొంత సేపు రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇదే సమయంలో దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ శాసనసభ్యుడు రాధాకృష్ణ అనుచరులు ఫోన్‌లకు దూరంగా తన నివాస గృహంలో గడిపారు. ఆంధ్రభూమి ప్రతినిధి ఎట్టకేలకు ఆయనను కలిసి మాట్లాడగా ముక్తసరిగా నో కామెంట్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులపై తనను కదలించవద్దన్నారు. ఏదిఏమైనా పరిస్థితి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. రాజకీయాల కతీతంగా దాదాపు కాపు నాయకులందరూ తునికి వెళ్లి ఉండటం వలన నగరంలో ప్రశాంత వాతావరణం కన్పించింది. విశాఖపట్టణం వైపు వెళ్లే లారీలను గుంటూరు, విజయవాడ, ఏలూరు మధ్య ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై పరిస్థితులు ఎలా ఉన్నాయో సెల్‌ఫోన్‌ల ద్వారా తెలుసుకుంటూ గడిపారు. విశాఖపట్టణం వైపు వెళ్లే బస్సులను కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. విశాఖపట్టణం వైపు 12 ఆర్టీసీ సర్వీసులను పూర్తిగా నిలిపేశామని కృష్ణా రీజనల్ మేనేజర్ పివి రామారావు తెలిపారు. ఇతర ప్రాంతాలకు యథావిథంగా నడుపుతున్నామన్నారు. 1988 డిసెంబర్ 26న జరిగిన వంగవీటి మోహనరంగా హత్యానంతరం నగర చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో ఒక్క విజయవాడ కాదు కోస్తా జిల్లాలన్నీ అతలాకుతలమయ్యాయి. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు భస్మమయ్యాయి.
ఏకంగా 40 రోజులపాటు కర్ఫ్యూ విధించబడిందంటే నాటి పరిస్థితిని ఒక్కసారి తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. ఈ కారణంగానే నాటి టిడిపి ప్రభుత్వం కాపుల విషయంలో అనేకానేక కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. నాటి అనుభవాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా కోస్తా జిల్లాల్లో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.