రాష్ట్రీయం

వివాహితపై యాసిడ్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 29: వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామ సమీపంలో వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రికి బాధితురాలిని తరలించారు. అయతే, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. కొత్తవాడకు చెందిన బాధితురాలికి డోర్నకల్‌లో నివాసి, మేనమామ చంటితో వివాహమైంది. భర్తతో అభిప్రాయభేదాలు ఏర్పడి గత నెలరోజులుగా ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. బుధవారం మధ్యాహ్నం ఫోన్ రావడంతో బయటకు వెళ్లిందని, గర్మిళ్లపల్లి వద్ద యాసిడ్ దాడికి గురైనట్టు సమాచారం రావడంతో హుటాహుటిన ఎంజీఎంకు చేరుకున్నామని కుటుంబీకులు చెబుతున్నారు. ఏడాది కిందట నగరంలోని సాకరాసికుంట ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ చందుతో పరిచయం ఏర్పడి, అక్రమ సంబంధంగా మారిందని, ఈ విషయంలో ఆమె భర్త చంటి పలుమార్లు మందలించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో భర్తతో విభేదాలు ఏర్పడి పుట్టింటికి వచ్చినట్లు తెలుస్తోంది.