రాష్ట్రీయం

రైల్వే జూనియర్ కళాశాల విద్యార్థికి జాతీయ స్కూల్ గేమ్స్‌లో పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: తార్నా క రైల్వే జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్న మాస్టర్ యశ్ వర్మకు జాతీయ స్కూల్ గేమ్స్‌లో మెడల్స్ గెలుచుకున్నాడు. ఈ నెల 26 నుంచి 30 వరకు ఢిల్లీలో నిర్వహించిన 63వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో 400 మీటర్ల ఇండివిడ్యువల్ మెడ్‌లేలో బంగారు పతకం, 200 మీటర్ల బట్టర్‌ఫ్లై స్విమ్మింగ్‌లో బ్రోంజ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా ఈ నెల 12 నుంచి 14వరకు వరంగల్‌లో జరిగిన 63వ తెలంగాణ స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌లో 19 ఏళ్ల లోపు విభాగంలో బట్టర్‌ఫ్లై సిమ్మింగ్‌లో 100, 200 మీటర్లు, ఇం డివిడ్యుయల్ మెడ్‌లే 400 మీటర్ల విభాగంలో గోల్డ్‌మెడల్ గెలుచుకున్నాడు.
మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు
అదనంగా ఎసి 3టైర్ బోగీ
ప్రయాణీకులకు అదనపు రవాణా సదుపాయం కలిగించేందుకు గాను శాశ్వతంగా మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నెం.12749/12750కి 3 టైర్ ఎసి బోగీ ఏర్పాటు చేసినట్లు రైల్వే వెల్లడించింది. ఈ సౌకర్యం డిసెంబర్ 1 నుం చి అమల్లోకి వస్తుందని తెలిపింది.
పలు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్-కాకినాడ టౌన్ మధ్య డిసెంబర్ 1న నెం.07075 ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే తెలిపింది. ఆరో రోజు సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో అదే రైలు డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరుతుంది. ఆదిలాబాద్- దాదర్- ఆదిలాబాద్ మధ్య డిసెంబర్ 5, 7 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ఆదిలాబాద్‌లో 5న ఉదయం 7 గంటలకు బయలుదేరుతుండగా, తిరుగు ప్రయాణంలో దాదర్ నుంచి రాత్రి 12.50కి బయలుదేరుతుందని వెల్లడించింది.