రాష్ట్రీయం

బాలికలకు డిసెంబర్ 10న ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్‌షిప్ టెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: పదవ తరగతి చదువుతున్న బాలికలకు ‘మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్ 2018’ను డిసెబంర్ 10న నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎండి నారా భువనేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడేళ్లగా నిర్వహిస్తున్న ఈ పరీక్షను గండిపేటలోని ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన 25 మంది ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఇంటర్మీడియట్ విద్య కోసం రూ.23 లక్షలు అందించడం జరుగుతోందని తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 10 మంది బాలికలకు నెలకు రూ.5 వేలు, రెండో స్ధానంలో ప్రతిభ కనబర్చిన మరో 15 మందికి రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్ జూనియర్ కళాశాలలో చదువు కొనసాగించేందుకు స్కాలర్‌షిప్ అందజేస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.