రాష్ట్రీయం

దేశంలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఈ ఏడాది తొలి పది నెలల్లో గత ఏడాదితో పోల్చితే గణనీయంగా తగ్గినట్లు కేంద్ర రవాణా శాఖ వెల్లడించింది. నిరుడిపై దాదాపు మృతుల సంఖ్య ఐదు వేల వరకు తగ్గింది. 2016లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొలి పదినెలల్లో 1,13,890 మంది మృతి చెందగా, ఈ ఏడాది అదే కాలంలో 1,08,887 మంది మృతి చెందారు. దేశం మొత్తం పైన ప్రమాదాల్లో మరణాల రేటు -4.40 శాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది 5458 మంది మృతి చెందగా, ఈ ఏడాది 4934 మంది మరణించారు. గత ఏడాదితో పోల్చితే మరణాల రేటులో -9.6 శాతం తగ్గుదల కనిపించింది. మహారాష్టల్రో నిరుడితో పోల్చితే రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య 807, గుజరాత్‌లో 775, కర్నాటకలో 731, పశ్చిమ బెంగాల్‌లో 717, పంజాబ్‌లో 521, బీహార్‌లో 378 తగ్గింది. పంజాబ్‌లో రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. జాతీయ స్ధాయిలో పంజాబ్ ఈ కేటగిరీలో 14.4 శాతం తక్కువగా నమోదు చేసుకుని రికార్డు సృష్టించింది. దేశంలో రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గడానికి ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు కారణమని చెప్పవచ్చును. ఒక కేసులో సుప్రీం కోర్టుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు రోడ్ సేఫ్టీ కోసం తీసుకుంటున్న చర్యలను నివేదించాయి. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల్లోమరణించే ప్రతి పది మందిలో ఒకరు భారత్ మరణిస్తున్నారు. ఇప్పుడున్న మరణాల రేటును సగానికి సగం తగ్గించినప్పుడే రోడ్ సేఫ్టీ బాగున్నట్లు ధృవీకరించగలమని గ్లోబల్ రోడ్ సేఫ్టీ ఇప్పటికే ప్రకటించింది. కాని ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాల్సిందే.