రాష్ట్రీయం

విశాఖలో ఎన్‌హెచ్-16ను డీనోటిఫై చేసి టోల్‌ప్లాజాను ఎందుకు వసూలు చేస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: విశాఖపట్నం నగరం ద్వారా వెళ్లే జాతీయరహదారి-16 భాగాన్ని మినహాయించినప్పుడు , నగరంలోని టోల్ ఫ్లాజా వాహనాల నుంచి ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారని హైదరాబాద్ హైకోర్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ప్రశ్నించింది. విశాఖలో ఎన్‌హెచ్-16ను మినహాయిస్తూ 2015 మే 1వ తేదీన ఎన్‌హెచ్ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు అగనంపూడి టోల్‌ప్లాజా వాహనాల నుంచి ఫీజును వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ గాజువాక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి ఈశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. నగరంలో టోల్‌ప్లాజాను ఏర్పాటు చేసినందు వల్ల భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని, వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నాయన్నారు. ఈ టోల్‌ప్లాజాను తరలించాలని అనేకసార్లు నగర ప్రజా సంఘాలు కోరాయన్నారు. వైన్‌షాపుల నిమిత్తం కూడా జాతీయ రహదారిని డినోటిఫై చేసిన విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్‌కు కూడా తాము వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. ఈవిషయమై ప్రాజెక్టు డైరెక్టర్ స్పందించలేదన్నారు. అనంతరం కోర్టు ఈ కేసును విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదావేసింది.